Site icon NTV Telugu

2026 Pongal Fight : సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. గెలిచే పుంజు ఎవరో.?

Tollywood

Tollywood

సంక్రాంతి అంటే కోడిపందాలు ఏ రేంజ్ లో సాగుతాయో అంతే స్థాయిలో సినిమా పందాలు జరుగుతుంటాయి. పొంగల్ కు సినిమాలనుఁ రిలీజ్ చేసి హిట్ కొట్టి పండగ పుంజు అనిపించుకోవాలని అనుకుంటారు స్టార్ హీరోలు. ఈ ఏడాది బాలయ్య, వెంకీ పోటీలో నిలిచి ఇద్దరు హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు అందరి ద్రుష్టి 2026 సంక్రాంతిపై ఉంది. ఈ సారి సంక్రాంతి పోరు ఓ రేంజ్ లో జరగబోతుంది. బరిలో మెగాస్టార్, మాస్ మహారాజ్ తో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ కూడా ఉన్నారు.

Also Read : VIJAY 69 : భగవంత్ కేసరి vs జననాయకుడు.. సోషల్ మీడియాలో వార్

ఈ సారి పోటీని మొదలుపెట్టేందుకు అందరికంటే ముందుగా వస్తున్నాడు విజయ్. ఆయన హీరోగా నటిస్తున్న జానాయకుడు పొంగల్ కానుకగా జనవరి 9న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెట్టబోతున్నాడు. విజయ్ చివరి కావడంతో తమిళ్ లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. తెలుగులో విజయ్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు. హిట్ టాక్ వస్తే భారీ కలెక్షన్స్ వస్తాయని గతంలో ప్రూఫ్ అయింది. తమిళ్ లో సోలోగా దిగుతున్న విజయ్ కు తెలుగులో భారీగా పోటీ నెలకొంది. మెగాస్టార్ హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న mega 157 సంక్రాంతికి రానుంది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాంతో వెంకీకి భారీ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఈ సారి చిరుకు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక పొంగల్ బరిలో ఉన్న మరొక హీరో మాస్ మహారాజ్ రవితేజ. కిషర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న RT76 సినిమా సంక్రాంతికే థియేటర్స్ లోకి వస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ వారి అనగనగ ఒక రాజు జనవరి 14న వస్తున్నాడు. ఇలా ముగ్గురు స్టార్ హీరోలు ఒక యంగ్ హీరో పోటీ పడుతున్న ఈ సంక్రాంతి పోరులో గెలిచి సంక్రాంతి పుంజు అనిపించుకునే హీరో ఎవరో చూడాలి

Exit mobile version