NTV Telugu Site icon

Ugram: అది.. కుర్ర హీరోలతో పెట్టుకుంటే మాములుగా ఉండదు.. ఇచ్చి పడేయడమే

Naresh

Naresh

Ugram: అల్లరి నరేష్.. ఒకప్పుడు కమెడియన్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో.. ఇప్పుడు ఎలాంటి పాత్రను అయినా అవలీలగా చేయగల నటుడు అని గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. నాంది లాంటి విభిన్నమైన కథతో రీఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చిన నరేష్.. అదే సినిమా డైరెక్టర్ తో ఉగ్రం అంటూ వస్తున్నాడు. టైటిల్ కు తగ్గట్టే సినిమాలో నరేష్ ఉగ్రరూపం చూపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్, మిరానా జంటగా తెరకెక్కిన ఉగ్రం సినిమా మే 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు కామెడీ పోలీస్ గా కనిపించిన నరేష్.. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాదు .. సినిమాపై హైప్ ను కూడా తీసుకొచ్చి పెట్టింది. ఇక దీనికి తోడు టాలీవుడ్ కుర్ర హీరోల సపోర్ట్.. నరేష్ కు ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ మధ్య జరిగిన ఉగ్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కుర్ర హీరోలు.. అడివి శేష్, సందీప్ కిషన్, నిఖిల్, విశ్వక్ సేన్ సందడి చేశారు.

Akhil Akkineni: నీ కష్టం పగోడికి కూడా రాకూడదు బ్రో.. వీటికి దూరంగా వెళ్లిపో

ప్రస్తుతం ఏ సినిమా అయినా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలి. మంచి టాక్ తెచ్చుకోవాలి. అలా అయితేనే సినిమా హిట్ కొడుతోంది. ఇక సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవ్వాలంటే రీల్స్ చేయాల్సిందే. అంటే.. ఆ సినిమాలోవి చేస్తే ఏం తెలుస్తుంది. అందుకే ఉగ్రం టీం అందుకు భిన్నంగా ఒక సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. అదే అల్లరి నరేష్.. సినిమాల విషయంలో ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది.. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన రీల్స్ తో ఈ కుర్రహీరోలు ఇమిటేట్ చేశారు. అల్లరి నరేష్ దగ్గరకు రొటీన్ స్టోరీస్ వస్తే.. ఎలా రిజెక్ట్ చేస్తాడు అని అడివి శేష్ చూపించాడు. ఇక కొత్త కథలు వస్తే ఎలా రియాక్ట్ అవుతాడు అనేది విశ్వక్ సేన్ చూపించగా.. ఉగ్రం సినిమా సెట్ లో ఎలా ఉన్నాడు అనేది సందీప్ కిషన్ చేశాడు. ఇక నాంది తరువాత నరేష్ ఎలా ఉన్నాడు అనేది నిఖిల్ చేసి చూపించాడు. ప్రస్తుతం వీరి వీడియోలు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి. ఇక తనకు ఇంత సపోర్ట్ గా ఉన్న హీరోలకు నరేష్ థాంక్స్ చెప్పాడు. ఇక ఈ వీడియోలను చూసిన అభిమానులు ఈ కుర్ర హీరోల్లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా..? అని కొందరు, అది.. కుర్ర హీరోలతో పెట్టుకుంటే మాములుగా ఉండదు.. ఇచ్చి పడేయడమే అంటూ నవ్వేస్తున్నారు. మరేందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోలపై ఓ లుక్ వేయండి.