Site icon NTV Telugu

Yash Mother : యశ్‌ తో మూవీ చేయను.. వాడికి ఆ విలువ తెలియదు..

Yash

Yash

Yash Mother : కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కేజీఎఫ్‌ తో భారీ ఫేమస్ సంపాదించుకున్నాడు. హీరోగా ఇప్పుడు టాక్సిక్ సినిమాతో రాబోతున్నాడు. ఆయన తల్లి పుష్ప ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారింది. ఆమె నిర్మాతగా ‘కొత్తలవాడి’ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ ప్రెస్ మీట్ నేడు హైదరాబాద్ లోఒ నిర్వహించారు. ఇందులో ఆమెకు ఓ రిపోర్టర్ ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేశాడు. మీరు నిర్మాతగా మీ కొడుకు యశ్ తో మూవీ చేస్తారా అని ప్రశ్నించారు. దానికి యశ్ తల్లి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు.

Read Also : 100-Year Tea Stall: వందేళ్ల నాటి టీ స్టాల్.. కస్టమర్లే ఛాయ్ చేసుకుని తాగుతారు..

‘నా కొడుకుతో అస్సలు చేయను. ఎందుకంటే వాడికే చాలా డబ్బులు ఉన్నాయి. కడుపు నిండిన వాడికి అన్నం పెడితే వాడికి ఆ విలువ తెలియదు. కాబట్టి అన్నం లేని వారికి పెట్టాలి. నేను కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేస్తాను’ అంటూ తెలిపారు. ఆమె నిర్మాతగా మారిన తర్వాత మొదటిసారి కొత్తలవాడి అనే మూవీని చేస్తున్నారు.

ఆమె పా అనే బ్యానర్ ను స్థాపించారు. ఇందులో కొత్త వారికి అవకాశాలు ఇస్తానని గతంలోనే ప్రకటించారు. కొత్తలవాడి మూవీలో పృథ్వీ అంబార్ హీరోగా నటిస్తున్నారు. సిరాజ్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. యశ్ ప్రోత్సాహంతోనే ఆమె నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టినట్టు తెలుస్తోంది. తెరవెనక అన్నీ తానై యశ్ చూసుకుంటున్నారంట.

Read Also : HHVM : ‘వీరమల్లు’ పార్ట్-1లో పవన్ పాత్ర అదే.. జ్యోతికృష్ణ క్లారిటీ..

Exit mobile version