Site icon NTV Telugu

Tollywood : తెలుగులో సెటిలైపోయిన పరభాష స్టార్ హీరో

Dulquer

Dulquer

దుల్కర్‌ త్రివేండ్రంలో కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ వుంటున్నాడు. మలయాళ మూవీ ‘కింగ్‌ ఆఫ్‌ కొత్తా’ డిజాస్టర్‌ తర్వాత తెలుగు సినిమా తప్ప మరోటి చేయలేదు. తెలుగులో మాత్రం మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్‌తో దుల్కర్‌ హ్యాట్రిక్‌ కొట్టాడు. లక్కీ భాస్కర్‌తో రూ. 100 కోట్ల గ్రాస్ దాటాడు. థియేటర్స్‌లోనే కాదు, ఓటీటీ ఆడియన్స్‌ను ఆకట్టుకుని టాప్‌ రేటింగ్‌లో నిలిచింది. టాలీవుడ్‌ ఆడియన్స్‌కు బాగా దగ్గరకావడంతో తెలుగులో తప్ప మరో లాంగ్వేజ్‌లో నటించడం లేదు దుల్కర్‌.

Also Read : Dude : యంగ్ హీరో సినిమాకు భారీ ఓటీటీ డీల్

లక్కీ భాస్కర్‌ రిలీజ్‌ కాకుండానే దుల్కర్‌ తెలుగులో రెండు తెలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. దుల్కర్‌, రానా కలిసి కాంత మూవీ నిర్మిస్తూ నటిస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. 1950లో మద్రాస్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథాంశంతో పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోంది. మిస్టర్‌ బచ్చన్‌ భామ భాగ్యశ్రీ బోర్సే దుల్కర్‌తో జత కడుతోంది.సీతారామం నిర్మించిన స్వప్న మూవీస్‌ దుల్కర్‌తో ‘ఆకాశంలో ఒక తార’ సినిమాను స్టార్ట్‌ చేసింది. పవన్‌ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కూడా పాన్‌ ఇండియాగా రిలీజ్‌ అవుతోంది.  యంగ్‌ హీరోల్లో పాన్‌ ఇండియా ఇమేజ్ వున్న ఏకైక హీరో దుల్కర్‌ కావడంతో.. తెలుగు దర్శక నిర్మాతలు ఈ మలయాళ హీరోను ఎక్కువగా ప్రిఫర్‌ చేస్తున్నారు. మలయాళం.. తమిళం ఇమేజ్‌ వుండడం దుల్కర్‌కు కలిసొస్తోంది. తెలుగు హీరోల కంటే ఎక్కువ సినిమాలు చేసేస్తూ ఈ ఏడాది రెండు సినిమాలతో వస్తున్నాడు. రీసెంట్‌గా ఓ బడా నిర్మాత దల్కర్‌తో సినిమా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగులో సెటిల్ అవుతున్నాడు దుల్కర్.

Exit mobile version