Site icon NTV Telugu

Tollywood : తన సినిమాలకు తానే టైటిల్స్ పెడుతున్న స్టార్ హీరో

Mass Jathra

Mass Jathra

మిరపకాయ్ టైటిల్ విన్న వెంటనే రవితేజ స్టైల్ గుర్తొస్తుంది కదా ఆ టైటిల్ కూడా ఆయన పెట్టిందే. స్క్రిప్ట్ విన్న వెంటనే “ఈ క్యారెక్టర్ చాలా నాటుగా ఘాటుగా ఉంది. టైటిల్ కూడా మిరపకాయ్‌ అయితే బాగుంటుందబ్బాయ్” అని రవితేజ చెప్పడంతో, డైరెక్టర్ హరీష్‌ శంకర్ “అదే పర్ఫెక్ట్ అన్నయా” అన్నారట. తర్వాత సినిమా హిట్, టైటిల్ సూపర్‌హిట్ అంటే టైటిల్ సెన్స్ కూడా హాట్ అండ్ స్పైసీగా ఉండడమే రవితేజ ప్రత్యేకత అని చెప్పొచ్చు.

Also Read : SrinuVaitla : శ్రీనువైట్లతో సినిమా.. నితిన్ అవుట్.. శర్వానంద్ ఇన్.. కారణం ఇదే

“మిస్టర్ బచ్చన్” టైటిల్ వెనుక కూడా ఇంట్రస్టింగ్ స్టోరీ ఉంది. డైరెక్టర్ హరీష్ శంకర్ చాలా టైటిల్స్ ఆలోచించి నామ్ తో సునా హోగా క్యాప్షన్ అనుకున్నాడట అయితే, రవితేజ ఒక్క మాట అన్నాడట మన టైటిల్ మిస్టర్ బచ్చన్ పెట్టేద్దాం అన్నాడట అయితే మిరపకాయ్ హిట్ సెంటిమెంట్ తో మిస్టర్ బచ్చన్ పెట్టేశాడట హరీష్‌ శంకర్. ఇది స్వయంగా డైరెక్టర్ హరీష్ శంకరే ఈవెంట్ లో చెప్పడంతో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు లేటెస్ట్ టాక్ “మాస్ జాతర” కూడా రవితేజ బ్రెయిన్ నుంచే పుట్టిందని డైరెక్టర్ భాను బోగవరపు ఇంటర్వ్యూలో చెప్పాడు. అది కేవలం టైటిల్ ఐడియా కాదు రవితేజ మేకింగ్ సెన్స్ కూడా అద్భుతమంటారు యూనిట్ సభ్యులు. అంతే కాదు, సిద్ధూ జొన్నలగడ్డతో జరిగిన ఒక చిట్‌చాట్‌లో రవితేజ అన్నాడు. “నైన్టీ పర్సెంట్ షూట్ పూర్తయ్యాకే సినిమా ఆడుతుందా, లేదా అనేది అర్థమైపోతుంది” అని అంటే తనలోని డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ ఇలా అన్ని కోణాలు చూపిస్తున్నాడని ఫ్యాన్స్ ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు.

Exit mobile version