Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో

Pridviraj Sukumaran

Pridviraj Sukumaran

మాలీవుడ్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ పొరుగింటిపై కాన్సట్రేషన్ చేసి.. సొంత గూటికి కాస్త దూరమయ్యాడు. వారణాసి, దైరా అంటూ ఇతర ఇండస్ట్రీలో బిజీ అయ్యాడు. లాస్ట్ ఇయర్ ఎంపురన్2లో కనిపించినప్పటికీ.. క్రెడిట్ మోహన్ లాల్ ఖాతాలో చేరిపోయింది. ఆ తర్వాత విలయాత్ బుద్ద అనే సినిమా చేశాడు కానీ ఆ మూవీ ఒకటి వచ్చిందన్న విషయం కూడా కేరళ ఆడియన్స్ మర్చిపోయారంటే.. సినిమా ఏ లెవల్లో ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది వచ్చిన పల్లిచట్టంబిలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు పృధ్వీ. కానీ అదీ సినిమాకు ఏ మాత్రం ప్లస్ కాలేదు.

ద గోట్ లైఫ్, గురువార్ అంబలనడయిల్ తర్వాత సోలో హీరోగా వరదరాజ మన్నార్ హిట్ కొట్టిన దాఖలాలు లేవు. అనదర్ ఇండస్ట్రీలపై కాన్సట్రేషన్ కారణంగా తన సినిమాలు కూడా ఆన్ టైంలో కంప్లీట్ చేయలేని పరిస్థితి. అయితే ఈ పొరుగు ఇండస్ట్రీల్లో కమిటైన భారీ ప్రాజెక్ట్స్ తన ఇమేజ్, మార్కెట్ డబుల్ చేస్తాయి కానీ కేరళ ఆడియన్స్‌తో టచ్ పోతే.. అసలుకే మోసం వస్తుందనుకున్నాడేమో.. సొంత గూటిలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు దించేయబోతున్నాడు పృధ్వీ. నిషామ్ బషీర్ దర్శకత్వంలో వస్తున్న ఐ నోబడీలో నటించాడు పృధ్వీ రాజ్ సుకుమారన్. ఈ ఏడాది ఫిబ్రవరి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్ పోనై.. జులై 9న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ఖలీఫా ఓనం పండుగ సందర్భంగా ఆగస్టు 20న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు వరదరాజ్ మన్నార్. హిందీలో కరీనా కపూర్- మేఘనా గుల్జర్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ దైరా సెప్టెంబర్ 18న రాబోతుంది. ఇలా వరుసగా టూ, త్రీ మంత్స్‌లో సౌత్, నార్త్ కవర్ చేసేస్తున్నాడు రణ కుంభ.