NTV Telugu Site icon

Baby Movie: బేబీ మూవీ వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.. చేసి ఉంటేనా.. ?

Vishwak

Vishwak

Baby Movie: చిన్న సినిమా, పెద్ద సినిమా.. స్టార్ హీరో, యంగ్ హీరో.. స్టార్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్.. నిర్మాత పాత, కొత్త ఇలాంటివేమీ ఇప్పటి ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. కథ బావుందా.. ? కంటెంట్ నచ్చిందా..? అనేది మాత్రమే లెక్కలోకి తీసుకుంటున్నారు. ఈ మార్పు వలన చిన్న సినిమాలు సైతం భారీ విజయాన్ని అందుకొని టాలీవుడ్ ను ఓ రేంజ్ లో నిలబెడుతున్నాయి. తాజాగా బేబీ కూడా అలంటి సినిమానే. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోలు.. ఇప్పటివరకు హీరోయిన్ గా కూడా పరిచయం కానీ అమ్మాయి, ఒక కామెడీ సినిమా తీసిన డైరెక్టర్.. పీఆర్ గా చేసిన నిర్మాత.. వీరందరూ కలిసి తీసిన సినిమా బేబీ. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇక నిన్ననే ఈ సినిమాను అల్లు అర్జున్.. ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రశంసించాడు. ఇక్కడవరకు బాగానే ఉన్నా.. ఈ సినిమా గురించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది.

సాధారణంగా ఒక సినిమాకు ఎంతోమంది నటీనటులను అనుకుంటారు.. కొంతమంది తమకు కథ నచ్చక, ఇంకొంతమంది డేట్స్ అడ్జెస్ట్ అవ్వక.. ఇంకొంతమంది తమ ఇమేజ్ ను కాపాడుకోవడానికి కొన్ని పాత్రలు చేయం అని చెప్పుకొస్తారు. అలా బేబీ సినిమాను కూడా లోక స్టార్ హీరో రిజెక్ట్ చేశాడు అని డైరెక్టర్ సాయి రాజేష్ మీడియా ముందే చెప్పుకొచ్చాడు. అయితే ఆ హీరో పేరు చెప్పకపోవడంతో అందరు లైట్ తీసుకున్నారు. ఇక నేడు విశ్వక్ సేన్.. వేసిన ట్వీట్ వైరల్ కావడంతో సాయి రాజేష్ మాట్లాడింది విశ్వక్ గురించే అని క్లారిటీ వచ్చేసిందని చెప్పుకొస్తున్నారు. బేబీ సినిమాలోని విరాజ్ పాత్రకు ముందు విశ్వక్ ను అనుకున్నారట. సాయి రాజేష్.. విశ్వక్ ను సంప్రదించడం, ఆయన నో అని చెప్పడంతో అక్కడితో సమస్య ముగిసిపోయింది. కానీ, సినిమా హిట్ అయ్యేసరికి డైరెక్టర్.. ఒక హీరో ఈ సినిమాను వద్దు అన్నాడు.. కథ కూడా వినకుండానే.. వీడితో సినిమా చేసేది ఏంటి అన్నట్లు మాట్లాడాడు అని చెప్పుకొచ్చాడు.

ఇక దీనికి రియాక్ట్ అయినా విశ్వక్.. నో అంటే నో .. అరవడం ఎందుకు.. కూల్ గా ఎవరి పని వాళ్ళు చేసుకుందాం అని చెప్పుకొచ్చాడు. దీంతో విరాజ్ పాత్రకు ముందుగా విశ్వక్ ను అనుకున్నట్లు తెలుస్తోంది. నిజం చెప్పాలంటే.. ఆ పాత్ర కనుక విశ్వక్ చేసి ఉంటే .. అతని ఇమేజ్ డ్యామేక్ అయ్యేది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఈ నగరానికి ఏమైంది సినిమా నుంచి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్.. ఒక అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన విరాజ్ పాత్ర చేస్తే.. కచ్చితంగా అతని కెరీర్ కు మైనస్ అయ్యేదని, అది కాక.. విశ్వక్ కాలేజ్ స్టూడెంట్ లా కనిపించడం అనేది కొద్దిగా ఎబెట్టుగా ఉండేది అని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా విశ్వక్ ఆ పాత్రను వదిలి మంచి పని చేశాడని, విరాజ్ చాలా చక్కగా కనిపించి, సినిమాకు హైలైట్ గా నిలిచాడని అంటున్నారు.