NTV Telugu Site icon

Vishal: లోకేష్- విజయ్ కాంబోలో విలన్ గా విశాల్..

Vishal

Vishal

Vishal: లోకేష్ కనగరాజ్.. హీరోలను విలన్లను చేయగలడు.. విలన్స్ ను హీరోలుగా మార్చగలడు. తీసినవి మూడే మూడు సినిమాలు కానీ, పాన్ ఇండియా డైరెక్టర్ లిస్ట్ లోకి చేరిపోయాడు. ఇక ప్రస్తుతం తనకు మొదటి హిట్ ను అందించిన విజయ్ తో కలిసి లోకేష్ దళపతి 67 చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కథను బట్టి హీరోకు ఎంత ప్రాముఖ్యత ఉందో విలన్ కు కూడా అంతే ఉంటున్నదట. దీంతో మరో స్టార్ హీరోను విలన్ గా మార్చడానికి రెడీ అయ్యాడు. కోలీవుడ్ కుర్ర హీరో విశాల్ కు ఆ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. విజయ్ కు విలన్ గా విశాల్ ను లోకేష్ సంప్రదించాడట. అయితే ఆ ఆఫర్ ను విశాల్ సున్నితంగా తిరస్కరించాడట. అదే విషయాన్ని విశాల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

విజయ్ కు విలన్ గా నన్ను అడిగిన మాట వాస్తవమే.. కానీ నాకున్న కమిట్ మెంట్స్ వలన ఒప్పుకోలేకపోయాను. నేను విలన్ గా చేయడానికి మొహమాటపడను.. ఈసారి అవకాశం వస్తే ఖచ్చితంగా విలన్ గా చేస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇక విశాల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. విజయ్, లోకేష్ కాంబో అంటే భారీ అంచనాలు ఉంటాయి. అందులో విలన్ అంటే ఆషామాషీ కాదు.. అలాంటి ఛాన్స్ వదులుకోవడంపై వీకే ఫ్యాన్స్ విశాల్ ను ఏకిపారేస్తారు అనుకున్నా.. విశాల్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా ఉండడంతో వారు కూడా విశాల్ కు మద్దత్తు పలికారు. మరి విశాల్ ప్లేస్ లో విజయ్ కు విలన్ గా ఎవరు నటిస్తారో చూడాలి.