Site icon NTV Telugu

Stand Up Rahul Trailer: పేరు రాహుల్ .. వెటకారం ఎక్కువ.. నిలకడ తక్కువ

raj tarun

raj tarun

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ భారీ విజయం కోసం చాలా కష్టాలు పడుతున్నాడు. ‘ఒరేయ్ బుజ్జిగా‘ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రాజ్ తరుణ్ తాజాగా స్టాండప్ రాహుల్ చిత్రంతో మరోసారి హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. సాంటో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ హై ఫైవ్ పిక్చర్స్ బ్యానర్స్ పై నంద్ కుమార్ అబ్బినేని భరత్ మాగులూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన వర్ష బొల్లమ్మ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ మొత్తం వినోదాత్మకంగా కట్ చేశారు.. వెటకారం ఎక్కువ ఉండే కుర్రాడు రాహుల్.. నిలకడలేని ఉద్యోగాలు చేస్తూ జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు.

ఇక ఉద్యోగాలన్నీ వదిలేసి స్టాండప్ కమెడియన్ గా నవ్విస్తూ ఉండే అతడి లైఫ్ లోకి వర్ష వస్తుంది.. రాహుల్ కి పెళ్లంటే ఇష్టం ఉండదు.. లివింగ్ రిలేషన్ లో ఉండాలనుకుంటాడు . వర్షకు పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. నిలకడలేని మనస్తత్వంతో రాహుల్ ఎలా నిలబడగలిగాడు.. జీవితంలో తాను అనుకున్నది సాదించాడా..? అనేది సినిమాలో చూడాలి. మొత్తానికి ట్రైలర్ కొత్తగా, ఫ్రెష్ ఫీల్ తో కనిపిస్తుంది. ఇక రాహుల్ మునుపెన్నడూ లేని కొత్త అవతారంలో కనిపించాడు. కొత్త తరహా కథతో వస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమాతో రాజ్ తరుణ్ హిట్ ని అందుకుంటాడా..? లేదా అనేది చూడాలి.

Exit mobile version