Varanasi: బర్త్‌డేకు ‘వారణాసి’ ట్రీట్ ఉంటుందా?.. రాజమౌళి నిర్ణయంపై ఫ్యాన్స్ వెయిటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi: ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఈ సినిమాపై అంచనాలు ఇప్పటకే ఆకాశాన్ని తాకుతున్నాయి. గత ఏడాది విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచగా, ఇప్పుడు అందరి దృష్టి మహేష్ బాబు పుట్టినరోజు అయిన ఆగస్టు 9పై పడింది. ఈసారి అభిమానులకు ప్రత్యేక సర్ప్రైజ్ ఉంటుందా లేదా అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. గత ఏడాది మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సినిమా నుంచి భారీగా ఆశించారు. అయితే ఆ సమయంలో రాజమౌళి ఎలాంటి కంటెంట్‌ను విడుదల చేయలేదు. దీంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. అనంతరం చిత్రబృందం మరికొంత సమయం తీసుకుని నవంబర్‌లో ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఆ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చినప్పటికీ, బర్త్‌డే రోజున ఎలాంటి అప్డేట్ లేకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
ఇప్పుడు ఈ సినిమా విడుదలకు మరో పది నెలల సమయం మాత్రమే ఉండటంతో పుబ్లిసిటీ కార్యక్రమాలు వేగం పుంజుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా మహేష్ బాబు పుట్టినరోజు వంటి ప్రత్యేక సందర్భాన్ని ఉపయోగించుకుని ఒక చిన్న టీజర్, లేదా రుద్ర పాత్రకు సంబంధించిన ప్రత్యేక వీడియో విడుదల చేయాలని అభిమానులు సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన డిమాండ్లు భారీగా వినిపిస్తున్నాయి. రాజమౌళి క్వాలిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తారనే విషయం తెలిసిందే. కంటెంట్ పూర్తిగా సిద్ధమైన తర్వాతే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడాన్ని ఆయన ఎప్పుడూ ఇష్టపడుతుంటారు. అయినప్పటికీ ఈసారి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చిన్నపాటి వీడియో అయినా విడుదల చేస్తే అభిమానులకు అది ప్రత్యేక కానుకగా నిలిచే అవకాశం ఉంది.
Also Read
- Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ..
- Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
పౌరాణిక అంశాలు, యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’లో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే అంతకుముందు ఆగస్టు 9న రాజమౌళి అభిమానులకు ఏదైనా ప్రత్యేక ట్రీట్ ఇస్తారా లేదా అన్నదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికర చర్చగా మారింది.
తాజావార్తలు
-
Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్‌పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్‌గాంధీ మద్దతు
-
IISc Study: ఆవు ఎంజైమ్‌తో ప్రమాదకర బ్యాక్టీరియాకు చెక్.. IISc సంచలన పరిశోధన
-
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
-
Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్‌తో స్పెషల్ మీట్
-
Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!