NTV Telugu Site icon

SSMB29:మహేష్ బాబు పాస్ పోర్ట్ లాక్కున్న రాజమౌళి

Untitled Design (24)

Untitled Design (24)

టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ దర్శకుడు రాజమౌళి కాంబోలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త ఏడాది ప్రారంభంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. కానీ పూజ ఫోటోలు గాని, వీడియోలు గాని బయటకు రానివ్వలేదు. పూజ కంటే ఎన్నో రోజుల ముందు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారు. కాగా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే… షూటింగ్ షురూ చేయడానికి జక్కన్న రెడీ అయినట్లు.. సోషల్ మీడియాలో వీడియె వదిలాడు జక్కన్న.

తాజాగా రాజమౌళి ఇన్ స్టా లో ఒక వీడియో షేర్ చేశారు. అందులో సింహాన్ని బోనులో బంధించినట్టు ఉంది. అలాగే ఒక పాస్ పోర్ట్ చూపిస్తూ ఫోటోకు పోజ్ ఇచ్చారు. మరి దీని అర్ధం ఏంటీ అంటే.. గతంలో అదే సింహం ఫోటో షేర్ చేసిన రాజమౌళి… ఆ సింహం మీద మహేష్ బాబును ట్యాగ్ చేశారు. ఇప్పుడు ఆ సింహాన్ని బోనులో లాక్ చేసినట్లు అర్థం వచ్చేలా వీడియో షేర్ చేశారు. అంటే తన చేతిలో ఉన్న పాస్ పోర్ట్ మహేష్ బాబుది అని అర్థం.

అయితే మనకు తెలిసి మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ఏడాదికి మూడు నాలుగు ఫారిన్ ట్రిప్పులైన వేస్తారు.. ఇక రాజమౌళి సినిమా అంటే మినిమం మూడు నాలుగేళ్లు డేట్స్ కేటాయించాల్సిందే.. ఇందు కారణంగా ఇప్పుడు మహేష్ పాస్ పోర్ట్ జక్కన్న లాక్కోవడం చూస్తుంటే… ఆయన్ను లాక్ చేశారని అర్థమవుతుంది. ఫారిన్ షెడ్యూల్ కోసం పాస్ పోర్ట్ తీసుకున్నారని టాక్. ఇక ఇప్పటి నుంచి మహేష్ షెడ్యూల్స్ అన్నీ రాజమౌళి చేతిలో ఉంటాయన్నమాట. ఇక రీసెంట్ గా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా ఇండియా ల్యాండ్ అయింది. రాజమౌళి షేర్ చేసిన వీడియో కింద కూడా ప్రియాంక చోప్రా ఫైనల్లీ అని కామెంట్ చేశారు.