#SSMB29 : 120 దేశాల్లో విడుదలకు ప్లాన్.. రాజమౌళి కొత్త రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ #SSMB 29 (వర్కింగ్ టైటిల్)పై అంచనాలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల కెన్యాలో జరిగిన షూటింగ్ సందర్భంగా అక్కడి ప్రభుత్వ సహకారానికి రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. కెన్యా సందర్శన తనకు గొప్ప అనుభవమైందని, అక్కడ గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివని రాజమౌళి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన, తనయుడు కార్తికేయతో కలిసి కెన్యా మంత్రి ముసాలియా ముదావాదిని మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే.
Also Read : Vijay-Rashmika: మూడోసారి ముచ్చటగా జంటగా స్క్రీన్ షేర్..!
Also Read
- Buchi Babu: "నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా".. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
- Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
- Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
- Peddi Pre Release Event: నేను పుట్టింది ఎంత నిజమో.. 'పెద్ది' ఇండస్ట్రీని షేక్ చేయడం అంతే నిజం: జగపతి బాబు
ముసాలియా, రాజమౌళి టీమ్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో స్పందించారు. శక్తివంతమైన కథనాలు, అద్భుతమైన విజువల్స్, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడంలో రాజమౌళి అసాధారణ ప్రతిభ కనబరుస్తారని కొనియాడారు. తూర్పు ఆఫ్రికా అంతటా పరిశీలించిన అనంతరం షూటింగ్ కోసం తమ దేశాన్ని ఎంచుకోవడం గర్వకారణమని అన్నారు. మాసాయి మారా మైదానాలు, నైవాషా సరస్సు, ఐకానిక్ అంబోసెలి వంటి ప్రసిద్ధ ప్రాంతాలు సినిమాలో భాగమవనున్నాయని ఆయన వెల్లడించారు.
అలాగే ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. ఇది రాజమౌళి కెరీర్‌లోనే కాకుండా భారతీయ సినిమాకి కొత్త రికార్డు కానుంది. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహస వీరుడి కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా , పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ఫస్ట్ లుక్‌ను నవంబరులో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!