Fans Awaiting for Mahesh Babu’s Rudra Look in SSMB29: ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ 29’ నుంచి వరుస అప్డేడ్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఆయన ‘కుంభ’ అనే పాత్రలో విలన్‌గా నటిస్తున్నట్టుగా తెలిపారు. అయితే వీల్ చైర్‌లో ఉన్న కుంభ లుక్‌పై కాస్త ట్రోలింగ్ జరిగింది కానీ.. సైంటిఫిక్‌గా రాజమౌళి ఏదో చేస్తున్నారనే విషయం మాత్రం క్లియర్ కట్‌గా తెలుస్తోంది. కుంభ లుక్ చూశాక సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఎస్ఎస్ఎంబీ 29 సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ప్రియాంక లుక్ చూస్తుంటే.. పసుపు రంగు చీర ధరించి ఎక్కడో పర్వత శ్రేణులలో నిలబడి గన్‌తో ఫైరింగ్ చేస్తున్నట్లుగా ఉంది. చీర కట్టులో చేతిలో తుపాకీ పట్టుకుని బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న ప్రియాంక.. ‘మందాకిని’ అనే పాత్రలో నటిస్తున్నట్టుగా రివీల్ చేశారు. ఇప్పటివరకు ప్రియాంకను మోడ్రన్ గర్ల్‌గా చూపిస్తారని అనుకున్నారు కానీ.. మందాకిని అచ్చు తెలుగు అమ్మాయిలా చీర కట్టులో కనిపిస్తూ ఉండడంతో ఆమె పాత్రపై అంచనాలు పెరిపోయాయి.
Also Read: Chikiri Chikiri Song: సోషల్ మీడియాలో ‘చికిరి’ వైబ్.. ఇండియాలోనే కాదు గ్లోబల్ లెవల్లో సౌండ్!
ఎస్ఎస్ఎంబీ 29లో కీలక పాత్రలైన కుంభ, మందాకిని లుక్స్ వచ్చేశాయి కాబట్టి.. నెక్స్ట్ మహేష్ బాబు లుక్ కోసం ఫాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బాబు ఈ సినిమాలో ‘రుద్ర’ అనే పాత్రలో నటిస్తున్నట్టుగా ముందు నుంచి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అంతేకాదు ఒకానొక సమయంలో ఎస్ఎస్ఎంబీ 29 టైటిల్ రుద్ర అనే ప్రచారం కూడా జరిగింది. దీంతో రుద్ర కోసం వెయిటింగ్ అంటున్నారు ఫ్యాన్స్. నవంబర్ 15న జరగబోయే ఈవెంట్‌లో బాబు లుక్‌తో పాటు టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి రాజమౌళి రెడీ అవుతున్నారట. ఈ నేపథ్యంలో బాబు పోస్టర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కుంభ, మందాకినికే ఓ రేంజ్ రెప్పాన్స్ ఉంటే.. బాబు పోస్టర్ వస్తే సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం.
