NTV Telugu Site icon

SSMB29: ఎక్కించండి.. ఎక్కించండి.. ఇంకా హైప్ ఎక్కించండి

Mahesh

Mahesh

SSMB29:ఒక సినిమా మొదలవ్వకముందే రికార్డులు సృష్టిస్తుంది అంటే.. అది ఖచ్చితంగా SSMB29 నే అని చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు.. దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై మహేష్ అభిమానులే కాదు.. ప్రతి ప్రేక్షకుడు ఆ అంచనాలను ఓ రేంజ్ లో పెట్టేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాకు ఆస్కార్ రావడంతో ఈ అంచనాలు ఆకాశం పైన ఇంకా ఏమైనా ఉంటే.. దాన్ని అందుకునేలా ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తోంది.. ఎప్పుడెప్పుడు మహేష్ లుక్ వస్తుందా..? అని ఎదురుచూస్తున్నారు. పోనీ.. ఇవన్నీ కాదు అసలు ఈ కాంబో కలిసి కనిపించినా అదో పెద్ద సంచలనం సృష్టిస్తుంది. తాజాగా అలాంటి ఫోటో ఒకటి బయటికి వచ్చింది. రాజమౌళి- మహేష్ బాబు డ్యూయో.. ఒక ఫ్రేమ్ లో కనిపించారు.

Rana Daggubati: కన్నుకు, కిడ్నీకి సర్జరీ జరిగింది.. అనారోగ్య సమస్యలపై మొదటిసారి నోరువిప్పిన రానా

మహేష్ బాబు వైట్ షర్ట్ లో వెనుక నుంచి జక్కన్నతో మాట్లాడుతూ కనిపిస్తుండగా.. రాజమౌళి, మహేష్ చెప్పిన మాటలను శ్రద్దగా వింటున్నట్లు చేతులు కట్టుకొని కనిపించాడు. ఇక ఈ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఒక్క ఫొటోకే ఇంత సెన్సేషన్ సృష్టిస్తే.. సినిమా అనౌన్స్ చేసిన రోజున అభిమానులను పట్టుకోవడం కష్టమే అని చెప్పాలి. ఇకపోతే మహేష్ తో రాజమౌళి.. ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే కథను పూర్తి చేసే పనిలో జక్కన్న ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కాంబో పట్టాలెక్కనుంది. ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. శరవేగంగా ఈ షూటింగ్ ను పూర్తిచేశాకా కానీ మహేష్, జక్కన్న సినిమాలో అడుగుపెట్టడు. ఇక ఇలాంటి ఫోటోలు చూసినప్పుడే హైప్ ఓ రేంజ్ లో ఎక్కేస్తూ ఉంటుంది. మరి ఈ కాంబోలు ఎలాంటి రికార్డులు సృష్టిస్తాయో చూడాలి.

Show comments