SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్- మహేష్ కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో SSMB29 తెరకెక్కనుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాజమౌళి.. మహేష్ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు. అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోందని ఇప్పటికే మేకర్స్ తెలిపారు. ఈ సినిమాను KL నారాయణ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై ఇప్పటినుంచే ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు అభిమానులు. ఈ ఏడాదిలోనే SSMB29 వెళ్లనుంది. ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ ను ఫైనల్ చేసే పనిలో రాజమౌళి బిజీగా మారాడు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అదేంటంటే.. రాజమౌళి- మహేష్ మూవీ బడ్జెట్ వెయ్యి కోట్లు.. అని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు తెలుగు సినిమా స్టాండర్డ్స్ 500 కోట్లు వరకే ఆగిపోయాయి. కానీ , మొట్ట మొదటిసారి వెయ్యి కోట్ల బడ్జెట్ తో సినిమాఅంటే .. టాలీవుడ్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఎదిగిపోయిందని చెప్పుకొస్తున్నారు. అయితే చాలామంది ఈ న్యూస్ ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. ఒక 600 కోట్లు వరకు నమ్మొచ్చు కానీ, మరీ వెయ్యి కోట్లు కష్టమని చెప్పుకొస్తున్నారు. నిజం చెప్పాలంటే రాజమౌళి- మహేష్ మార్కెట్ ను బట్టిఅంత బడ్జెట్ పెట్టినా తప్పు లేదు. నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.