Site icon NTV Telugu

SSMB 28: ఈ ఉగాదికి అన్న వస్తున్నాడా?

Ssmb 28

Ssmb 28

అతడు సినిమా… టాలీవుడ్ లో ఒక క్లాసిక్. ఖలేజా సినిమాకి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ రెండు సినిమాలకి ఆడియన్స్ లో మంచి వైబ్ ఉంది కానీ థియేటర్స్ లో మాత్రం ఆడలేదు. బాక్సాఫీస్ దగ్గర ఎఫెక్ట్ చూపించలేకపోయినా కూడా మహేశ్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఘట్టమనేని అభిమానులకి చాలా ఇష్టం. ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ, పాస్ట్ బాక్సాఫీస్ రికార్డ్ ని చెరిపేసి సాలిడ్ హిట్ ఇవ్వడానికి మహేశ్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయ్యింది. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పై ఉన్న ఈ మూవీని సితార ఎంటర్తైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. పూజా హెగ్డేతో పాటు శ్రీలీలా కూడా మహేశ్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో హిట్ బాకీని తీర్చేయాలని డిసైడ్ అయిన త్రివిక్రమ్, మహేశ్ ని మాస్ లుక్ లో చూపించనున్నాడు.

Read Also: Pushpa 2: ‘ఎర్రమంజిల్’లో ‘ఎర్ర చందనం’ స్మగ్లర్…

గతంలో SSMB 28 షూటింగ్ నుంచి కొన్ని ఫోటోస్ లీక్ అయ్యాయి. వీటిలో మహేశ్ బాబు హెడ్ కి బ్యాండ్ కట్టుకోని మాస్ లుక్ లో ఉన్నాడు. మహేశ్ హెడ్ కి బ్యాండ్ కట్టిన ప్రతిసారి సినిమా సూపర్ హిట్ అయ్యింది. SSMB 28 కూడా ఆ హిట్ లిస్ట్ లో చేరే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే లీకులు తప్ప అఫీషియల్ గా టైటిల్, ఫస్ట్ లుక్ లాంటి విషయాల గురించి ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు. అయితే ఉగాది రోజున SSMB 28 ఫస్ట్ లుక్ బయటకి వచ్చే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో ఒక రూమర్ వినిపిస్తోంది. మార్చ్ 22న ఉగాది పండగ రోజున SSMB 28 నుంచి అప్డేట్ బయటకి రానుందనే టాక్ వినిపిస్తోంది. మరి టైటిల్ ని అనౌన్స్ చేస్తారా లేక ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.

Exit mobile version