Site icon NTV Telugu

SSMB 28: మహేష్-త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందా? ఇదిగో క్లారిటీ..!!

Ssmb 28

Ssmb 28

SSMB 28: సర్కారు వారి పాట సినిమా తర్వాత సూపర్‌స్టార్ మహేష్‌బాబు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఖలేజా తర్వాత దాదాపుగా 12 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. SSMB28 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. తల్లి ఇందిరాదేవి మరణం తర్వాత సినిమా షూటింగులకు మహేష్‌బాబు కాస్త బ్రేక్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా ఆగిపోయిందని ఇటీవల రూమర్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ రూమర్లకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఈ మూవీ రెండో షెడ్యూల్ నవంబర్ రెండో వారం నుంచి ప్రారంభం కానుందని నిర్మాత నాగవంశీ ప్రకటించాడు. సెకండ్ షెడ్యూల్‌లో యాక్షన్ సీన్స్ షూటింగ్‌ను అతిత్వరలో స్టార్ట్ చేస్తామని, రానున్న రోజుల్లో మరిన్ని ఎగ్జైటింగ్ అప్‌డేట్స్ వస్తాయని నాగవంశీ ట్వీట్ చేశాడు.

Read Also: NTR 30: ఎన్టీఆర్-కొరటాల శివ మూవీపై క్రేజీ అప్‌డేట్.. అభిమానులకు పండగే..!!

కాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తవగానే హీరో మహేష్‌బాబు ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లి తాజాగా ఇండియాకు తిరిగొచ్చాడు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చిన‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో మహేష్‌బాబు సరసన పూజాహెగ్డే నటిస్తోంది. మహర్షి మూవీ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న రెండో మూవీ ఇది. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేష‌న్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 28న తెలుగుతో పాటు త‌మిళంలోనూ విడుద‌ల కానుంది. కాగా మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘అత‌డు’, ‘ఖ‌లేజా’ చిత్రాలు క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ సాధించ‌కోపోయినా బుల్లితెర‌పై మాత్రం ఘ‌న విజ‌యం సాధించాయి. ఇప్పటికీ ఈ సినిమాలను టీవీలలో టెలికాస్ట్ చేస్తే మంచి టీఆర్పీ రేటింగులు నమోదవుతున్నాయి.

Exit mobile version