Site icon NTV Telugu

SS Rajamouli: ఉక్రెయిన్‌లో షూటింగ్ అద్భుతంగా చేశాం.. కానీ

rrr

rrr

ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళిల భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ ప్రపంచం వ్యాప్తంగా విడుదలకు సిద్దమౌతుంది. ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు మార్చి 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా విడుదలకు 10 రోజులు మాత్రమే ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో రాజమౌళి ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. యుద్ధం రాకముందు ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఉక్రెయిన్ లో జరిగిన సంగతి తెలిసిందే.

” ఉక్రెయిన్‌లో షూటింగ్ అద్భుతంగా చేశాం.. కానీ అక్కడ యుద్ధం వస్తుందని ఊహించలేదు. ఉక్రెయిన్‌ ప్రజలు చాలా సహకరించారు, అక్కడి ఫుడ్, కల్చర్ బాగా నచ్చాయి. ఇలాంటి ఒక వార్త వినాల్సివస్తుందని అనుకోలేదని చెప్పుకొచ్చారు. ఇక ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశాక మాకెంతో సంతృప్తి కలిగింది.. ఆయన సానుకూలంగా స్పందించారు. ఇక ఆర్ఆర్ఆర్.. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర అంటూ వస్తున్న వార్తలను జక్కన్న కొట్టిపారేశారు. ఇది ఎవరి జీవిత చరిత్ర కాదు, ఇది ఫిక్షన్ మూవీ” అని చెప్పుకొచ్చారు.

Exit mobile version