Site icon NTV Telugu

SS Rajamouli: అందుకు దమ్ము, ధైర్యం ఉండాలి

Rajamouli On Vikrant Rona

Rajamouli On Vikrant Rona

SS Rajamouli Review On Vikrant Rona Film: తనకు ఏదైనా సినిమా నచ్చితే.. వెంటనే సోషల్ మీడియాలో దానిపై తన రివ్యూ ఇస్తుంటాడు ఎస్ఎస్ రాజమౌళి. ఫలితంగా.. ఆ సినిమాలకి కాస్త మైలేజ్ వచ్చి పడుతుంది. ఇప్పుడు ‘విక్రాంత్ రోణ’ విషయంలోనూ అదే జరిగింది. జులై 28న విడుదలైన ఈ పాన్ ఇండియా సినిమాని రీసెంట్‌గా చూసిన జక్కన్న.. సుదీప్, విక్రాంత్ రోణ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సినిమా తనకెంతో నచ్చిందని.. ఇలాంటి చిత్రంపై పెట్టుబడి పెట్టాలంటే దమ్ము, ధైర్యం ఉండాలని.. ఆ ధైర్యం చేసినందుకు నీకు తగిన ఫలితం దక్కిందంటూ ట్విటర్ మాధ్యమంగా జక్కన్న వెల్లడించారు.

‘‘విక్రాంత్ రోణ విజయం సాధించినందుకు సుదీప్‌కు, చిత్రబృందానికి శుభాకాంక్షలు. ఇలాంటి సినిమా చేయాలంటే.. దమ్ము, ధైర్మ, ఆత్మవిశ్వాసం ఉండాలి. నువ్వు (సుదీప్‌ని ఉద్దేశిస్తూ) ధైర్యంగా ముందడుగు వేసినందుకు, మంచి ఫలితం దక్కింది. ఈ చిత్రానికి ఆయువుపట్టు అయిన ప్రీ-క్లైమాక్స్ నిజంగా అద్భుతంగా ఉంది. అసలు అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అది చాలా బాగుంది. ఇక్కడ గుడ్డి స్నేహితుడు భాస్కర్‌ను ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సిందే’’ అంటూ జక్కన్న ట్వీట్ చేశాడు. ఇందుకు సుదీప్ బదులిస్తూ.. ‘‘ధన్యవాదములు సార్. మీ నుంచి ఇలాంటి ప్రశంసలు అందడం గర్వంగా ఉంది. భాస్కర్ సహా మా చిత్రబృందం తరఫు నుంచి మీకు బిగ్ హగ్’’ అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా.. అనూప్ భండారి దర్శకత్వంలో రూపొందిన ‘విక్రాంత్ రోణ’లో సుదీప్ సరసన శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికగా నటించింది. నిరూప్ భండారి, నీత అశోక్, మధుసుధన్ రావు కీలక పాత్రల్లో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రానికి దాదాపు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కొల్లగొడుతోంది. ఇప్పుడు రాజమౌళి ట్వీట్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మైలైజ్ దక్కడం ఖాయం.

Exit mobile version