SS Rajamouli Reveals The Genre of Mahesh Babu Film: మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తోన్న SSMB28 సినిమా ముగిశాక.. జక్కన్నతో మహేశ్ సెట్స్ మీదకి వెళ్లనున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి జక్కన్న ఇప్పటివరకూ పెద్ద విశేషాలేమీ బయటపెట్టలేదు. అప్పట్లో ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పారంతే! అంతకుమించి మరే అప్డేట్స్ రివీల్ చేయలేదు. అయితే.. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఈ సినిమా జోనర్ ఏంటో రివీల్ చేశాడు జక్కన్న.
అమెరికాలో నిర్వహించిన ఒక ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన జక్కనకు, మహేశ్ సినిమాకి సంబంధించి ప్రశ్న ఎదురైంది. అందుకు అతను బదులిస్తూ.. మహేశ్‌తో తాను గ్లోబ్‌ట్రాటింగ్ (యావత్ ప్రపంచం ప్రయాణం చేయడం) యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేయబోతున్నానని బదులిచ్చాడు. అంటే.. జేమ్స్ బాండ్ తరహాలోనే ఈ సినిమా ఉండబోతోందని మనం భావించొచ్చు. చాలా సందర్భాల్లో తాను మహేశ్‌తో సినిమా చేస్తే, అది జేమ్స్ బాండ్ తరహాలోనే ఉంటుందని జక్కన్న గతంలో చెప్పాడు. ప్రేక్షకులు సైతం మహేశ్‌ను జేమ్స్ బాండ్ పాత్రల్లోనే చూడాలనుకుంటున్నారని అన్నాడు. చూస్తుంటే, ఇప్పుడు అలాంటి సినిమానే చేయబోతున్నట్టు కనిపిస్తోంది.
కాగా.. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన లాంఛనంగా ప్రారంభించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. SSMB28 పనులు పూర్తయ్యాక.. తమ సినిమా షూటింగ్‌ను నిర్విర్వామంగా కొనసాగించేలా ప్రణాళికలు రచించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. SSMB28 సినిమా షూటింగ్ నిన్న ప్రారంభమైంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.