SS.Rajamouli: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు సుమ తెలియని సినీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు . ఇక సుమ భర్త రాజీవ్ కనకాల సైతం అభిమానులకు సుపరిచితుడే. ప్రస్తుతం వీరిద్దరి కొడుకు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. రోషన్ కనకాల.. బాల నటుడిగా పలు సినిమాల్లో కనిపించిన అతను ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రవికాంత్ పేరుపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు మహేశ్వరి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అప్పుడెప్పుడో పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో రోషన్ సరసన చెరుకూరి మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను దర్శక ధీరుడు రాజమౌళి రిలీజ్ చేసి.. చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు.
Jacqueline Carrieri: సర్జరీ వికటించి నటి జాక్వెలిన్ మృతి..
ఇక ఈ చిత్రానికి బబుల్ గమ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను జక్కన్న చేత రిలీజ్ చేయించారు. ” నటుడిగా అరంగేట్రం చేసిన రోషన్ నీకు అభినందనలు… నీకంటూ ఒక సొంత గుర్తింపు తెచ్చుకొని రాజీవ్ మరియు సుమ గారు గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నాను. మరియు బబుల్ గమ్ టీమ్ కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను” అని రాసుకొచ్చాడు. ఇక పోస్టర్ లో రోషన్, మానస రొమాంటిక్ లుక్ లో అదరగొట్టారు. ఒకరిని ఒకరు కౌగిలించుకోగా.. రోషన్ బబుల్ గమ్ ఊదుతూ కనిపించారు. ఈ సినిమా మొత్తం యూత్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించినట్లు సమాచారం. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను అక్టోబర్ 10 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి మొదటి సినిమాతోనే రోషన్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
https://x.com/ssrajamouli/status/1710256804481941638?s=20