NTV Telugu Site icon

MM. Keeravani: ఇది లోకంలోనే అత్యంత అరుదైన గిఫ్ట్… నా కన్నీళ్లు ఆగడం లేదు

Keeravani

Keeravani

MM.Keeravani: దేశం మొత్తం గర్వించదగేలా ఆస్కార్ అవార్డును ఇండియాకు తీసుకొచ్చారు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం. ఆ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెల్సిందే. నాటు నాటు సాంగ్ రాసిన చంద్రబోస్.. సంగీతం అందించిన కీరవాణికి ఆస్కార్ అవార్డులు లభించాయి. ఇక దీంతో ఇండియానే కాదు ప్రపంచం మొత్తం వారిని ప్రశంసిస్తోంది. సాధారణ అభిమానులతో పాటు దేశ, విదేశ ప్రముఖులు సైతం కీరవాణిని, రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక తాజాగా కీరవాణిని మరియు చంద్రబోస్ ను ప్రముఖ మ్యూజిషియన్ రిచర్డ్ కార్పెంటర్ తన కుటుంబంతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రపంచంలోనే అద్భుతమైన మ్యూజిషియన్ లో ఒకరు. ది కార్పెంటర్ సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆస్కార్ వేదికపై కీరవాణి సైతం చిన్నతనం నుంచి కార్పెంటర్ సాంగ్స్ వింటూ పెరిగానని చెప్పుకొచ్చారు. అలాంటి రిచర్డ్ కార్పెంటర్.. తన ఫేమస్ సాంగ్ అయిన టాప్ ఆఫ్ ది వరల్డ్ సాంగ్ ను కొంచెం మార్చి తన కూతుర్లతో పాటు.. పాడుతూ కీరవాణి బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Nani: సక్సెస్ వస్తే నా పేరు చెప్పి.. ఫెయిల్యూర్ అయితే డైరెక్టర్ పేరు చెప్పను

ఇక తనకు ఎంతో ఇష్టమైన గాయకుడు రిచర్డ్ కార్పెంటర్ తనకు శుభాకాంక్షలు చెప్పడంతో కీరవాణి తబ్బిఉబ్బిపోయారు. అసలు ఇది కలయా.. నిజమా అన్నట్లు ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ” ఇది చాలా స్పెషల్.. నేను ఎప్పుడు ఇది ఉహించలేనిది. నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. లోకంలోనే అత్యంత అద్భుతమైన బహుమతి.. ధన్యవాదాలు” అంటూ కీరవాణి చెప్పుకొచ్చారు. ఇక రాజమౌళి సైతం ఈ వీడియోపై స్పందించాడు. ” సార్, ఈ ఆస్కార్ క్యాంపెయిన్‌లో నా సోదరుడు ప్రశాంతంగా ఉండేవాడు. గెలవడానికి ముందు అయినా, తర్వాత అయినా అతను తన భావోద్వేగాలను బయటపెట్టలేదు. కానీ, ఇది చూసిన క్షణంలో కన్నీళ్లను అదుపు చేసుకోలేకపోయాడు.. మా కుటుంబానికి మరపురాని క్షణం.. చాలా ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments