Site icon NTV Telugu

RRR : మూవీపై విదేశీ మీడియా రాతలు… రాజమౌళి ఊహించని రియాక్షన్

Rajamouli

Rajamouli

RRR Success Celebrations బుధవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ RRR ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఒక్క భారతదేశంలోనే కాకుండా సినిమాకు విదేశీ సినీ ప్రియుల నుంచి కూడా అద్భుతమైన స్పందన లభించింది. ఏప్రిల్ 6న జరిగిన RRR Success Celebrationsలో మీడియాతో మాట్లాడిన రాజమౌళి మూవీపై విదేశీ మీడియా రాతలు, అక్కడి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ గురించి మాట్లాడారు.

Read Also : Hari Hara Veera Mallu : సెట్లో పవన్.. కొత్త లుక్ వైరల్

విదేశీ మీడియా నుండి RRR ప్రశంసలు పొందడం గురించి రాజమౌళి స్పందిస్తూ యునైటెడ్ స్టేట్స్ సినిమాను ప్రశంసిస్తుందని తాను ఊహించలేదని చెప్పాడు. రాజమౌళి మాట్లాడుతూ “బాహుబలి 2, ఆర్‌ఆర్‌ఆర్‌ రెండు సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. కానీ తేడా ఏంటంటే విదేశీ మీడియా మాత్రం RRR గురించి రాస్తోంది. న్యూయార్క్ టైమ్స్ కూడా మా సినిమా గురించి రాసింది. ముఖ్యంగా యూఎస్‌లోని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఇది నాకు హార్ట్ టచింగ్ మ్యాటర్. బాహుబలి 2కి జపాన్‌ నుంచి ప్రశంసలు వస్తాయని, ఆర్‌ఆర్‌ఆర్‌కి యూఎస్‌ నుంచి ఆదరణ వస్తుందని ఊహించలేదు. బాక్సాఫీస్ నంబర్‌లు ముఖ్యమనే విషయాన్ని కాదనలేము. కానీ ప్రేక్షకుల నుండి ప్రశంసలు చాలా ముఖ్యమైనవవి” అని ఆయన అన్నారు. “మనం చేయగలిగేది ప్రాజెక్ట్‌కి 100 శాతం ఇవ్వడం, చేయగలిగినంత ఉత్తమంగా చేయడం అని నేను ఎప్పుడూ చెప్తాను. అంకెలు మన చేతుల్లో లేవు, ప్రేక్షకులపై ఆధారపడి ఉంటాయి. ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలను మాత్రమే మనం అంచనా వేయగలము” అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

Exit mobile version