Site icon NTV Telugu

వీళ్లిద్దరి వల్లే 25 రోజులు వేస్ట్… చెర్రీ, తారక్ పై రాజమౌళి కామెంట్స్

RRR

“ఆర్ఆర్ఆర్” మేకర్స్ సినిమా ప్రమోషన్స్ లో దూకుడు పెంచారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం హైదరాబాద్ లో జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ సినిమా మేకింగ్ సమయంలో హీరోలు ఇద్దరి వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో వెల్లడించారు. సినిమాను 300 రోజులు షూట్ చేసి ఉంటే వీళ్లిద్దరి వల్ల కనీసం 25 రోజులు ఉంటాయి ఉంటాయి. ఇద్దరికీ 30 ఏళ్ళు దాటాయి.. ఇద్దరికీ పెళ్లయ్యింది… వెనుక అన్నా చచ్చిపోతాం అంటూ చెప్పే డై హార్డ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయినా కూడా సెట్స్ ఎన్టీఆర్ వచ్చి జక్కన్న నన్ను చరణ్ గిల్లాడు అని కంప్లైంట్ ఇస్తాడు. చరణ్ ఏమో అమాయకంగా లేదే.. నేను నా లైన్స్ చూసుకుంటున్నాను అంటాడు… అలా కనీసం ఆ వాదన 15 నిమిషాలకు పైగా సాగుతుంది” అంటూ సరదాగా స్పందించారు.

Read Also : వాళ్ళ ప్రశ్నలను మనం కాపీ కొట్టొద్దు… జర్నలిస్ట్ ప్రశ్నకు రాజమౌళి కౌంటర్

రాజమౌళి కామెంట్స్ వెంటనే స్పందించిన తారక్ “ఆరోజు నాపై దాడిని ఆపారా? పేదరాయుడిలా కూర్చొని చూశారు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారు” అంటూ సరదాగా కామెంట్ చేశారు. కాగా “ఆర్ఆర్ఆర్” మూవీ జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. సినిమాకు సంబంధించి జక్కన్న మార్క్ స్ట్రాటజీ మార్కెటింగ్ ప్లాన్ లతో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్.

https://www.youtube.com/watch?v=6g_kG2qEzTA
Exit mobile version