SS Karthikeya Dubbing Malayala Premalu : మలయాళ సినిమాల మీద తెలుగు వారు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలను కొంతమంది సినీ ప్రేమికులు అదే భాషలో చూసేస్తున్నారు. ఇక థియేటర్స్ లో వర్కౌట్ అవుద్ది అనుకుంటే దాన్ని డబ్ చేసి రిలీజ్ చేసేందుకు తెలుగులో బడా నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇక అలా కాదనుకుంటే కనుక సినిమా హక్కులు కొనుక్కున్న ఓటీటీ సంస్థ దాన్ని మిగతా భాషల్లోకి డబ్ చేసి అందులోనే రిలీజ్ చేసేస్తున్నారు. ఇక ఫిబ్రవరి 9వ తేదీన మలయాళంలో రిలీజైన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయింది. ఈ సినిమాను తెలుగు ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున ఆదరణ చూపిస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఈ సినిమా అంతా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లోనే చూపించారు.
Deepti Sunaina: బరువు దింపేసుకున్నారన్న అభిమాని.. దీప్తి షాకింగ్ రిప్లై!
ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాను రాజమౌళి కుమారుడు కార్తికేయ తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. రాజమౌళి డైరెక్ట్ చేసే దాదాపు అన్ని సినిమాలకు ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న కార్తికేయ గతంలో రిలీజ్ అయిన ఆకాశవాణి అనే సినిమాతో నిర్మాతగా మారాల్సింది. అయితే కరోనా ఎంట్రీతో ఆర్ఆర్ఆర్ సినిమా షెడ్యూల్స్ మ్యానేజ్ చేయలేక ఆ ప్రొడక్షన్ నుంచి ఆయన తప్పుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాతో ఆయన నిర్మాతగా మారుతున్నట్టు అయింది. ఇక ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. మార్చి 8న శివరాత్రి సంధర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. ఇక ప్రస్తుతానికి డబ్బింగ్ పనులు మొదలయ్యాయి అని అధికారికంగా న్యూస్ బయటకు వచ్చింది కానీ అది కార్తికేయ చేస్తున్నాడు అనే విషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
