Site icon NTV Telugu

Bollywood @ Saudi : సౌదీ బాట పట్టిన ఖాన్ లు… స్టార్ హీరోల మాస్టర్ ప్లాన్ ఏంటి ?

Bollywood

Bollywood

బాలీవుడ్ స్టార్ హీరోలంతా సౌదీ బాట పట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ఆదివారం సౌదీ అరేబియా సాంస్కృతిక శాఖ మంత్రి బదర్ బిన్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ ను కలిశారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌదీ అరేబియా సాంస్కృతిక శాఖ మంత్రి బాదర్ బిన్ ఫర్హాన్ అల్సౌద్‌… బాలీవుడ్ ప్రముఖ స్టార్స్ తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంటూ “బాలీవుడ్ సూపర్‌స్టార్స్ @iamsrk @BeingSalmanKhan @akshaykumar #SaifAliKhanతో సహా అభివృద్ధి చెందుతున్న భారతీయ చలనచిత్ర సంఘం సభ్యులను కలిసి భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడం చాలా ఆనందంగా ఉంది! #SaudiMinistryOfCulture #Saudivision2030.” అంటూ ట్వీట్ చేశారు.

Read Also : Bigg Boss Non Stop : ఈ వారం ఎలిమినేషన్… బ్యూటీ అవుట్

సౌదీ అరేబియాలోని రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ ఛైర్మన్ మహ్మద్ అల్ తుర్కీకి షారుఖ్ ఖాన్ ఇటీవల ముంబైలోని తన ఇల్లు మన్నత్‌లో ఆతిథ్యం ఇచ్చారు. ఇక షారుఖ్ ఖాన్ తర్వాత దీపికా పదుకొణె, జాన్ అబ్రహంతో కలిసి “పఠాన్” చిత్రంతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం 2023 జనవరి 25న విడుదల కానుంది. సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’, ‘కభీ ఈద్ కబీ దీపావళి’ సినిమాలతో బిజీగా ఉన్నారు. అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’, ‘రక్షా బంధన్’, ‘సెల్ఫీ’ వంటి చిత్రాలలో కనిపిస్తారు. సైఫ్ అలీ ఖాన్ ‘విక్రమ్ వేద’, ‘ఆదిపురుష్’ ఉన్నాయి.

Exit mobile version