NTV Telugu Site icon

Sriram: సక్సెస్ తలకెక్కని హీరో అల్లు అర్జున్.. నాకు ఇగో ఎక్కువ.. అందుకే

Bunny

Bunny

Sriram: శ్రీరామ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకరికొకరు, రోజా పూలు లాంటి హిట్ సినిమాలతో తెలుగువారికి దగ్గరైన ఈ హీరో.. చాలా గ్యాప్ తరువాత పిండం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ ప్రధాన పాత్రల్లో సాయికిరణ్ దైదా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పిండం. డిసెంబర్ 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన శ్రీరామ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా పంచుకున్నాడు.

మొదట్లో తన సినిమా హిట్ అవ్వాలంటే.. ఏదో ఒక దెబ్బ తగిలించుకోవాలి అనే ముద్ర పడిపోయిందని, మొదట్లో తాను చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు. 2006 నుంచి 2022 వరకు తాను ఇండస్ట్రీకి రాకపోవడానికి కారణం.. ఒకరికొకరు తరువాత తనకు యాక్సిడెంట్ అయ్యింది, దాన్ని నుంచి కోలుకోవడానికి చాలా టైమ్ పట్టింది.. ఆ తరువాత నేను తెలుగువైపు రాలేదు.. నాకే ఎందుకు నేను టాలీవుడ్ కు రాలేకపోయానని అనిపించింది. నాకు కొంచెం ఇగో ఎక్కువ.. అవకాశాలు ఇమ్మని నేను ఎవరిని అడగలేను. అందువల్లే.. రాలేకపోయాను అని చెప్పుకొచ్చాడు.

ఇక పిండం సినిమా ఈవెంట్స్ కు చాలామంది గెస్ట్ లను పిలిచాం.. కానీ, ఒక్కరు కూడా రాలేదు.మొత్తం వినకుండా అసలు ఆ పిండం టైటిల్ ఏంటి.. నెగెటివ్ గా అని వెళ్ళిపోమనేవాళ్ళు. నేను చెప్తున్నాను.. ది స్కేరియస్ట్ ఫిల్మ్ ను మేము అందిస్తున్నాం. దాన్ని ఇంగ్లిష్ లో కంటే తెలుగులో ప్రోపర్ గా పెట్టాలని ఆ టైటిల్ పెట్టాం. ఇక నాకు తెలుగు హీరోస్ లో నచ్చిన హీరోలు అంటే .. అల్లు అర్జున్ అని చెప్తాను. నాకు వ్యక్తిగతంగా ఆయన అంటే చాలా ఇష్టం. నేను అల్లు అర్జున్ ను గంగోత్రి కి ముందు చూసాను.. ఆ తరువాత ఈ మధ్య ఒక ఈవెంట్ లో చూసాను.. ఆయన నన్ను చూడగానే.. హే బ్రో .. ఎప్పిడి ఇరుకే బ్రో అంటూ తమిళ్ లో పలకరించాడు. ఎంతో స్వీట్ పర్సన్.. సక్సెస్ తలకెక్కని హీరో” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments