Srinu Vaitla : సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన దూకుడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ తర్వాత వచ్చిన ఆగడు మూవీ అట్టర్ ప్లాప్ అయింది. ఇంకా చెప్పాలంటే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సినిమా రిజల్ట్ గురించి తాజాగా శ్రీను వైట్ల ఎన్టీవీతో చేసిన పాడ్ కాస్ట్ లో స్పందించారు. మహేశ్ బాబుతో రెండు సినిమాలు చేశా. దూకుడు భారీ హిట్ అయింది. ఆ తర్వాత చేసిన బాద్షా బ్లాక్ బస్టర్ అయింది. ఆ నమ్మకంతోనే మహేశ్ బాబు ఆగడు కథను ఓకే చేశారు. కానీ ఆగడు చూసిన వారంతా దూకుడులా ఉందని తేల్చేశారు. నాకు కూడా చాలా సీన్ల విషయంలో అసంతృప్తి ఉంది. దూకుడు వచ్చిన కొన్ని సంవత్సరాలకే ఆగడు రావడంతో ప్రేక్షకులు రెండింటిని పోల్చుకున్నారు. కొంత టైమ్ తీసుకుంటే ఆ పోలిక వచ్చేది కాదేమో.
Read Also : Mass Jathara : మాస్ జాతర టీజర్ అప్డేట్.. డేట్, టైమ్ ఫిక్స్
సినిమా కథ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండేది. ఆ బాధ నాకు ఇప్పటికీ ఉంది. మహేశ్ బాబుకు మంచి హిట్ ఇవ్వలేకపోయాననే రిగ్రెట్ ఫీలింగ్ ఇప్పటికీ ఉంటుంది. కానీ ఆయన అవేవీ మనసులో పెట్టుకోలేదు. ఆ మూవీ తర్వాత కూడా నార్మల్ గానే నాతో మాట్లాడుతుంటారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఛాన్స్ వస్తే మహేశ్ బాబుతో మరో బ్లాక్ బస్టర్ తీసి ఆ రిగ్రెట్ ఫీలింగ్ పోగొట్టుకోవాలని ఉంది అంటూ చెప్పుకొచ్చారు శ్రీను వైట్ల. తాను ఎక్కువగా మణిరత్నం, పెద్ద వంశీ సినిమాలు చూసి ఇన్ స్పైర్ అయ్యేవాడినన్నారు. ఇప్పటికీ మంచి సినిమాలు తీసి మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకోవాలని ఉందన్నారు. అందుకే తన సినిమాలకు టైమ్ తీసుకుంటున్నట్టు తెలిపారు. తన సినిమాల్లోని కామెడీ సీన్స్ ను ఎప్పుడూ రీ క్రియేట్ చేయాలని అనుకోవట్లేదన్నారు.
Read Also : Mahesh Babu : సౌత్ లో ఏకైక హీరోగా మహేశ్ బాబు రికార్డ్.. ఎందులో అంటే..?
