Srinu Vaitla : శ్రీనువైట్ల డైరెక్షన్ లో మంచు విష్ణు హీరోగా వచ్చిన ఢీ సినిమా అప్పట్లో ఓ సంచలనం. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులోని కామెడీ సీన్లు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఆ సినిమాతోనే శ్రీనువైట్ల, మంచు విష్ణు ట్రాక్ లోకి వస్తారంటూ రూమర్లు వస్తున్నాయి. తాజాగా వాటిపై శ్రీనువైట్ల ఎన్టీవీతో చేసిన పాడ్ కాస్ట్ లో క్లారిటీ ఇచ్చారు. ఢీకి సీక్వెల్ ఉండదని తేల్చి చెప్పారు. ఈ మూవీకి సీక్వెల్ చేయట్లేదు. ఎందుకంటే ఆ సినిమాలో శ్రీహరి పాత్ర చాలా కీలకం. ఆయన ఇప్పుడు లేరు. ఆయన లేకుండా మూవీని తీయలేం. అప్పట్లో 2020లో స్క్రిప్ట్ అనుకున్నాం. కానీ శ్రీహరి లేకుండా సినిమాను తీయొద్దని ఫిక్స్ అయ్యాం. అందుకే సీక్వెల్ ను ఆపేశాం అంటూ తెలిపారు శ్రీనువైట్ల.
Read Also : Srinu Vaitla : మహేశ్ బాబు విషయంలో ఆ బాధ ఉంది.. శ్రీను వైట్ల కామెంట్స్
ఢీ సినిమాకు ముందు నేను తీసినవి ఓ మోస్తరు రేంజ్ హిట్ అయ్యాయి. కానీ ఢీ మూవీతోనే నాకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం అయిపోయింది. ఆ మూవీ తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. స్టార్ హీరోల సినిమాలు చేసే అవకాశాలు వచ్చాయి. అందుకే ఢీ నాకు చాలా స్పెషల్. కానీ అందులో శ్రీహరి గారి పాత్ర ఓ మైల్ స్టోన్. ఆ పాత్రకు ఆయన తప్ప ఎవరూ సూట్ కారు. ఆయన బాడీ లాంగ్వేజ్ ఎవరికీ లేదు. అందుకే ఆ పాత్రను డిస్టర్బ్ చేయాలని అనుకోవట్లేదు అంటూ చెప్పుకొచ్చారు శ్రీనువైట్ల. ఆయన క్లారిటీతో ఢీ మూవీకి సీక్వెల్ లేదని తేలిపోయింది. ఇక తాను త్వరలో చేయబోయే సినిమాను పూర్తి స్థాయి కామెడీ ట్రాక్ లో తీస్తున్నట్టు తెలిపారు. ఆ హీరో ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆడియెన్స్ ను మెప్పించేందుకు పూర్తి కామెడీ సినిమాతో వస్తున్నట్టు స్పష్టం చేశారు.
Read Also : Mass Jathara : మాస్ జాతర టీజర్ అప్డేట్.. డేట్, టైమ్ ఫిక్స్
