Site icon NTV Telugu

Trivikram – Venkatesh : వెంకటేశ్-త్రివిక్రమ్ సినిమాలో శ్రీనిధిశెట్టి..

Trivikram

Trivikram

Trivikram – Venkatesh : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా రోజుల తర్వాత తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చాడు. సీనియర్ హీరో వెంకటేష్ తో విక్రమ్ సినిమా ఉంటుందని ప్రచారం ఎప్పటినుంచో ఉంది. దానిపై రాజాగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. వీరిద్దరి సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టిని కన్ఫర్మ్ చేశారు. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమాపై ఇన్ని రోజులు ఉన్న రూమర్లకు చెక్ పడింది. అలాగే ఈ సినిమాలో శ్రీనిధి హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయింది. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి రెగ్యులర్ గా స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది.

Read Also : Allu Shireesh : శిరీష్ కు కాబోయే భార్య ఫొటో షేర్ చేసిన స్నేహారెడ్డి..

సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన గుంటూరు కారం ప్లాప్ అయిన తర్వాత త్రివిక్రమ్ కొన్ని రోజులు సైలెంట్ అయ్యాడు. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా ఉంటుందని అనౌన్స్ కూడా చేశారు. కానీ బన్నీ త్రివిక్రమ్ ను పక్కన పెట్టేసి అట్లీతో భారీ ప్రాజెక్టు చేస్తున్నాడు. దీంతో చేసేది లేక త్రివిక్రమ్ సీనియర్ హీరో వెంకటేష్ తో మూవీ మొదలు పెట్టేశాడు. అటు జూనియర్ ఎన్టీఆర్ తో మైథాలజికల్ సినిమా చేసేందుకు త్రివిక్రమ్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ డైరెక్షన్ లో భారీ సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత త్రివిక్రమ్ తో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్యాప్ లో వెంకటేష్ తో సినిమా పూర్తి చేస్తాడు త్రివిక్రమ్.

Read Also : Samantha : మళ్లీ దొరికిపోయిన సమంత.. రాజ్ ఇంట్లో దీపావళి వేడుకలు

Exit mobile version