యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక పక్క పాన్ ఇండియా మూవీస్ తో బిజీగా ఉంటూనే కొత్త సినిమాలకు సైన్ చేస్తున్నాడు. దర్శకుడు మారుతీ డైరెక్టర్న్ లో ప్రభాస్ కామెడీ థ్రిల్లర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు రాజా డీలక్స్ అని పేరు కూడా పెట్టారు. అధికారికంగా ఈ ప్రాజెక్ట్ ప్రకటించకపోయినా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు కూడా మేకర్స్ చెక్ పెట్టకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేటట్టే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక తాజగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల కనిపించనునందట.
మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా డైరెక్టర్లను కూడా బుట్టలో వేసుకున్న ఈ బ్యూటీ ఇటీవలే రవితేజ సరసన నటించే ఛాన్స్ కొట్టిసి లక్కీ గర్ల్ గా సెట్ అయ్యింది అనుకొనేలోపు ప్రభాస్ సరసన ఛాన్స్ పట్టేసి గోల్డెన్ గర్ల్ గా మారిపోయింది. ఇక ఇందులో ముగ్గురు హీరోయిన్లు ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్నారట.. శ్రీ లీల ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోగా రెండో హీరోయిన్ గా మెహరీన్ ని తీసుకొనే ప్రయత్నాల్లో ఉన్నారట మేకర్స్. మరి ప్రభాస్ సరసన ఈ ముద్దుగుమ్మలు ఎలాంటి హంగామా చేయనున్నారో చూడాలి.
