Site icon NTV Telugu

Allu Arjun: అల్లు అర్జున్ సరసన శ్రీలీల.. దర్శకుడిగా త్రివిక్రమ్

Allu Arjun

Allu Arjun

Allu Arjun: హీరోయిన్ శ్రీలీల నక్క తోక తొక్కింది. టాలీవుడ్‌లో నటించిన ఒకే ఒక్క సినిమాతో ఆమెకు వరుసగా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లిసందD సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శ్రీలీల తన అందంతో మరిన్ని అవకాశాలు దక్కించుకుంటోంది. వాస్తవానికి పెళ్లిసందD సినిమా యావ‌రేజ్‌గా నిలిచినా త‌న అంద‌చందాలు, గ్లామ‌ర్ త‌ళుకుల‌తో అభిమానుల‌ను శ్రీలీల ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ యువహీరోలందరూ ఆమె వెంటే పడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ర‌వితేజ ధ‌మాకా, న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజు, నితిన్ 32, వైష్ణవ్‌తేజ్ కొత్త సినిమాలోనూ శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. తాజాగా అల్లు అర్జున్ స‌ర‌స‌న కూడా నటించబోతోంది.

Read Also: Salman Khan: ‘టైగర్ 3’ కోసం వెటరన్ హీరోయిన్

అయితే అల్లు అర్జున్ పక్కన నటించేది సినిమా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అది యాడ్ ఫిల్మ్ మాత్రమే. ఈ ప్రకటనకు ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ర‌వి కె చంద్రన్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఈ యాడ్ ఫిల్మ్ షూటింగ్ హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శ‌ని, ఆదివారాల‌లో చేసినట్లు ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్, అల్లు అర్జున్‌, ర‌వి కె చంద్రన్‌ల‌తో శ్రీలీల దిగిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా త్వరలో అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఈ సీక్వెల్‌కు సుకుమార్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. అటు త్రివిక్రమ్‌-మహేష్‌బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘SSMB28’ సినిమాలోనూ సెకండ్ హీరోయిన్‌గా శ్రీలీల నటించనున్నట్లు ఇప్పటికే వార్తలు షికారు చేస్తున్నాయి.

Read Also: Relationship: భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచే కారణాలు ఇవే..!!

Exit mobile version