NTV Telugu Site icon

Srikanth: ఆరోజు రాశీ అందుకే కొట్టింది.. హీరోయిన్స్ తో ఎఫైర్స్ అంటే.. ?

Srikanth

Srikanth

Srikanth: టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా మారి కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక కుర్ర హీరోలు పెరుగుతున్న వేళ.. హీరోయిజానికి ఫుల్ స్టాప్ పెట్టి.. విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో అలరిస్తున్నాడు. ఇక ఈ మధ్యనే హీరోగా కోటబొమ్మాళీ పీఎస్ సినిమాలో నటించాడు. ఈ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక కొన్నిరోజుల క్రితం ఒక సినిమా ఈవెంట్ లో హీరోయిన్ రాశీ, శ్రీకాంత్ కలిసి ఉన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఎన్నో ఏళ్ళ క్రితం విడిపోయిన స్నేహితులు ఒక్కసారిగా కలిస్తే ఎలా ఉంటుందో వీరిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటుంటే తెలుస్తుంది. ఆ వీడియోలో రాశీ.. శ్రీకాంత్ ను కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. శ్రీకాంత్ ఏం అంటే.. రాశీ కొట్టిందో అని చాలామంది తమకు నచ్చిన మాటలను ఊహించుకున్నారు.

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రీకాంత్ రాశీ ఎందుకు కొట్టిందో వివరించాడు. ” ఆ ఈవెంట్ లో పక్కనే ఉన్న హీరోయిన్ రాశీని రాశీ అమ్మా అని పిలిచింది. నేను కూడా సరదాగా రాశీ అమ్మా అన్నాను. దానికి రాశీ నవ్వుతు నన్ను కొట్టింది” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయమే కాకుండా తన పర్సనల్ విషయాలను కూడా శ్రీకాంత్ పంచుకున్నాడు. సెట్ లో నేను అందరితో బావుండేవాడిని.. అందరూ నాకు మంచి స్నేహితులు.. సౌందర్య, ఉమ లాంటి వారితో నాకు కంఫర్ట్ ఉంటుంది. వారు ఇంటికి కూడా వస్తూ ఉండేవారు. ఇక ఊహతో నాకు విడాకులు అని రాసుకొచ్చారు. టీవీ లో బ్రేకింగ్ లు కూడా వేశారు. ఆ తరువాత మేము వాటిని ఖండించాం.” అని చెప్పుకొచ్చాడు. ఇక పెళ్లి కాకముందు హీరోయిన్స్ తో ఎఫైర్స్ ఉన్నాయట అన్న ప్రశ్నకు.. ” ఎఫైర్స్ మీరు చూసారా.. ? ఎవరో ఏదో చెప్పారు అని అడగకండి.. చూస్తే చెప్పండి” అంటూ సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.