Srikanth: మొన్న విడాకులు, ఇవాళ రేవ్ పార్టీ.. తప్పు లేదు అంటూ శ్రీకాంత్ వీడియో రిలీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srikanth Releases a Video about Bangalore Raveparty: బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీలో తెలుగు సినీ నటుడు శ్రీకాంత్ ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తానసలు ఆ పార్టీకే వెళ్లలదేని శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆయన వివరణ ఇస్తూ తన ఇంట్లో నుంచే ప్రత్యేకంగా వీడియోను రికార్డ్ చేసి విడుదల చేశారు. ఆ వీడియోలో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘నేను హైదరాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నా, బెంగుళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లినట్లు, నన్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి. కొన్ని వీడియో క్లిప్స్ చూశా, కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవటంతో నాకు సంబంధించిన వార్తలను వారు రాయలేదు. అయితే కొన్నింటిలో మాత్రం నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లానని వార్తలు వచ్చాయి. ఆ న్యూస్ చూసి నాతో సహా మా కుటుంబ సభ్యులందరూ నవ్వుకున్నాం అని శ్రీకాంత్ అన్నారు.
Pawan Wishes NTR: ఎన్టీఆర్ కి పవన్ స్పెషల్ విషెస్.. భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ!
Also Read
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Matsya: పడవ కింద నుంచి వెళ్లిన 'మిథికల్ ఫిష్'.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ 'మత్స్య'!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
మొన్న ఈ మధ్య నా భార్యతో నాకు విడాకులు ఇప్పించేశారు, ఇప్పుడేమో రేవ్ పార్టీకెళ్లానని అన్నారు, అయితే వార్తలు రాసిన వాళ్లు తొందపడటంలో తప్పులేదనిపించింది. ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన అతనెవరో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు, అతడికి కాస్త గడ్డం ఉంది, ముఖం కవర్ చేసుకున్నాడు. నేనే షాకయ్యా, అయితే అది నేను కాదు. దయచేసి అది ఎవరైనా నేనే అంటూ నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకు, పబ్స్ వెళ్లే వ్యక్తిని కాను నేను, ఎప్పుడైనా బర్త్ డే పార్టీలకు వెళ్లినా కొంత సేపు అక్కడి ఉండి వచ్చేస్తానంతే. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదని శ్రీకాంత్ అన్నారు. మీడియా మిత్రులు సహా ఎవరూ నమ్మొద్దు, విషయం తెలుసుకోకుండా.. రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టేసి రాసేస్తున్నారు, నాలాగా ఉన్నాడనే మీరు పొరబడి ఉంటారని నేను అనుకుంటున్నా, అందుకే ఈ వీడియో చేస్తున్నా. నేను ఇంట్లోనే ఉన్నాను. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!