KJQ: హీరోగా మారిన దసరా డైరెక్టర్ తమ్ముడు.. కొత్త సినిమా మొదలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pooja ceremony for SLVC Production no.8 ~ #KJQ: బ్లాక్‌బస్టర్ చిత్రం ‘దసరా’లో దీక్షిత్ శెట్టి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక అదే సినిమా డైరెక్టర్ తమ్ముడు, నటుడు శశి ఓదెల, దీక్షిత్ శెట్టి, యుక్తి తరేజా కాంబోలో SLV సినిమాస్ బ్యానర్‌పై ఓ సినిమా రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ ఈ ప్రతిష్టాత్మక బ్యానర్‌లో 8వ సినిమాగా తెరకెక్కుతోంది. కె.కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా సుధాకర్ చెరుకూరి.. 90ల నాటి ఒక ప్రత్యేకమైన కథాంశంతో పీరియాడికల్ క్రైమ్ డ్రామాగా నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇటీవలే కాన్సెప్ట్ గ్లింప్స్‌తో ప్రాజెక్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే మేకర్స్ రీసెంట్‌గానే లాంఛనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ప్రారంభ సన్నివేశానికి క్లాప్ కొట్టారు.
Atharva: అమెజాన్‌లో అన్ని భాషల్లో ట్రెండ్ అవుతున్న ‘అథర్వ’
Also Read
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
- Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
- August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
- Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రంలో కింగ్‌గా దీక్షిత్ శెట్టి, జాకీగా శశి ఒదెలా, క్వీన్‌గా యుక్తి తరేజా కనిపించబోతోన్నారు. అందుకే ఈ చిత్రానికి #KJQ కింగ్ – జాకీ – క్వీన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ టైటిల్ గ్లింప్స్‌తో సినిమాలోని ముఖ్య పాత్రలను పరిచయం చేశారు మేకర్స్. టైటిల్ గ్లింప్స్ వెరైటీగా ఉండటంతో వెంటనే అందరినీ ఆకట్టుకుంది. దీక్షిత్ శెట్టి స్ట్రైకింగ్‌గా కనిపిస్తుండగా, శశి తన రగ్డ్ లుక్‌తో, యుక్తి తరేజా తన అందంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. రెండు తుపాకులు, గులాబీలతో ఈ మూవీ టైటిల్‌ను ప్రజెంట్ చేయడంతో ఈ మూవీ కథ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చేశారు. ఈ చిత్రానికి పూర్ణచంద్ర తేజస్వి సంగీతాన్ని అందిస్తున్నారు. నాగేష్ బానెల్ సినిమాటోగ్రాఫర్‌గా, కార్తీక శ్రీనివాస్.ఆర్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. శ్రీకాంత్ రామిశెట్టి ప్రొడక్షన్ డిజైన్‌ను చూసుకుంటున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
-
E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!