NTV Telugu Site icon

KJQ: హీరోగా మారిన దసరా డైరెక్టర్ తమ్ముడు.. కొత్త సినిమా మొదలు

Sashi Odela Movie

Sashi Odela Movie

Pooja ceremony for SLVC Production no.8 ~ #KJQ: బ్లాక్‌బస్టర్ చిత్రం ‘దసరా’లో దీక్షిత్ శెట్టి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక అదే సినిమా డైరెక్టర్ తమ్ముడు, నటుడు శశి ఓదెల, దీక్షిత్ శెట్టి, యుక్తి తరేజా కాంబోలో SLV సినిమాస్ బ్యానర్‌పై ఓ సినిమా రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ ఈ ప్రతిష్టాత్మక బ్యానర్‌లో 8వ సినిమాగా తెరకెక్కుతోంది. కె.కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా సుధాకర్ చెరుకూరి.. 90ల నాటి ఒక ప్రత్యేకమైన కథాంశంతో పీరియాడికల్ క్రైమ్ డ్రామాగా నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇటీవలే కాన్సెప్ట్ గ్లింప్స్‌తో ప్రాజెక్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే మేకర్స్ రీసెంట్‌గానే లాంఛనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ప్రారంభ సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు.

Atharva: అమెజాన్‌లో అన్ని భాషల్లో ట్రెండ్ అవుతున్న ‘అథర్వ’

ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రంలో కింగ్‌గా దీక్షిత్ శెట్టి, జాకీగా శశి ఒదెలా, క్వీన్‌గా యుక్తి తరేజా కనిపించబోతోన్నారు. అందుకే ఈ చిత్రానికి #KJQ కింగ్ – జాకీ – క్వీన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ టైటిల్ గ్లింప్స్‌తో సినిమాలోని ముఖ్య పాత్రలను పరిచయం చేశారు మేకర్స్. టైటిల్ గ్లింప్స్ వెరైటీగా ఉండటంతో వెంటనే అందరినీ ఆకట్టుకుంది. దీక్షిత్ శెట్టి స్ట్రైకింగ్‌గా కనిపిస్తుండగా, శశి తన రగ్డ్ లుక్‌తో, యుక్తి తరేజా తన అందంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. రెండు తుపాకులు, గులాబీలతో ఈ మూవీ టైటిల్‌ను ప్రజెంట్ చేయడంతో ఈ మూవీ కథ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చేశారు. ఈ చిత్రానికి పూర్ణచంద్ర తేజస్వి సంగీతాన్ని అందిస్తున్నారు. నాగేష్ బానెల్ సినిమాటోగ్రాఫర్‌గా, కార్తీక శ్రీనివాస్.ఆర్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. శ్రీకాంత్ రామిశెట్టి ప్రొడక్షన్ డిజైన్‌ను చూసుకుంటున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.