టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి శ్రీదేవి విజయ్‌కుమార్. అందం, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో 2000 దశకంలో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, ఒక దశలో స్టార్ హీరోయిన్ల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్‌తో కలిసి చేసిన ‘ఈశ్వర్’ సినిమాలో ఆమె నటన, లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే పెళ్లి, కుటుంబ జీవితం కారణంగా సినిమాలకు దూరమైన శ్రీదేవి, చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్గా రీఎంట్రీ ఇస్తున్నారు. నారా రోహిత్ హీరోగా నటించిన ‘సుందరకాండ’ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఆమెకు ఇది ప్రత్యేకమైన రీ-ఎంట్రీ అవుతుంది. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్‌రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.
Also Read : Parada : అనుపమ పరదా’ స్పెషల్ ప్రీమియర్స్ ఫిక్స్.. బుకింగ్స్ షురూ..!
కాగా శ్రీదేవి ఈసారి సాధారణ గ్లామర్ రోల్ కాకుండా, అర్థవంతమైన, ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయింది..‘ఒక ఆడియన్స్‌గా చూసినా నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. డైరెక్టర్ ఈ కథ చెప్పగానే నేను షాక్ అయ్యా. ఎందుకంటే ఇలాంటి పాత్రను నేను ఎప్పుడూ చేయలేదు. డిఫరెంట్ ఎమోషనల్ కలిగిన ఈ రోల్ నాకు సవాల్ లాంటిది. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ స్క్రీన్ మీద నన్నే నేను చూసుకోవడం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ప్రభాస్‌తో నటించిన ఈశ్వర్ సినిమా లాస్ట్ ఇయర్ రీ-రిలీజ్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు నేను హీరోయిన్గా తిరిగి ఎంట్రీ ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు.