Site icon NTV Telugu

Sri Vishnu : ఆ మూవీ వల్లే నాకు బాలీవుడ్ ఆఫర్.. శ్రీవిష్ణు కామెంట్స్

Sri Vishnu

Sri Vishnu

Sri Vishnu : ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు వరుస హిట్లతో జోరు మీద ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన సింగిల్ మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఆయన వరుస ప్రమోషన్లు చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ విష్ణు.. తన కెరీర్ విషయాలను పంచుకున్నాడు. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలతో ఏదో ఒక అనుభవాన్ని నేర్చుకుంటున్నాను. చాలా వరకు కొత్త తరహా కథలు చేయాలనే ఆలోచనే నాకు ఉంటుంది. పైగా క్రియేటివ్ గా ఉండాలని అనుకుంటాను. అందుకే నా సినిమాలు చూసే వాళ్లకు కొంచెం వెరైటీగా అనిపిస్తుంటాయి. రొటీన్ సినిమాలు చేయడం నాకు అస్సలు నచ్చదు. అదే నన్ను సెపరేట్ కథల వైపు నడిపించింది.

Read Also : Operation Sindoor: అబద్దం.. అబద్దం.. అబద్దాల పుట్టగా పాకిస్తాన్..!

స్వాగ్ సినిమా చూసి చాలా మంది ఫోన్లు చూశారు. ఆ మూవీతోనే నాకు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. బ్రోచేవారెవరురా సినిమా చేసినప్పుడు చాలా ప్రశంసలు వచ్చాయి. టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. ఆ మూవీ తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. ఏది పడితే అది చేయడం నాకు ఇష్టం లేదు. ప్రతి సినిమా ప్రేక్షకులకు నచ్చేలా చేయాలన్నదే నా ఆలోచన. అందుకే సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తాను. త్వరలో కామెడీ సినిమాలే ఎక్కువగా చేయాలని అనుకుంటున్నాను. కాకపోతే మంచి కథలు రావాలి’ అంటూ చెప్పుకొచ్చాడు శ్రీ విష్ణు.

Read Also : AP Nominated Posts: ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ.. మరో లిస్ట్‌ విడుదల..

Exit mobile version