Single Trailer : ట్యాలెంటెడ్ యాక్టర్ శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ సింగిల్. కార్తీక్ రాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే9న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ మొత్తం ఫన్ తో నింపేశారు. దీన్ని చూస్తుంటే శ్రీ విష్ణు మళ్లీ తనకు బాగా కలిసి వచ్చిన ఫన్ జానర్ లోకి వచ్చేశాడు. గతేడాది స్వాగ్ అనే మూవీ తీసినా.. అది పెద్దగా వర్కౌట్ కాలేదు. అందుకే మళ్లీ కామెడీ ట్రాక్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సింగిల్ అబ్బాయి అమ్మాయిలతో ప్రేమలో పడితే ఎలాంటి పరిణామాలు ఫేస్ చేస్తాడనేది ఫన్నీగా చూపించేశారు.
Read Also : Sreeleela : శ్రీలీల గొప్ప మనసు.. మరో పాపను దత్తత తీసుకున్న హీరోయిన్..
ట్రైలర్ లో కామెడీనే కనిపిస్తోంది. ‘ఎంత రిచ్ అయినా హచ్ అనే తుమ్ముతాడు గానీ.. రిచ్ అని కాదు’ అనే వెన్నెల కిషోర్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. అలాగే ట్రైలర్ చివర్లో శ్రీ విష్ణు చెప్పే ‘అమ్మాయిల జోలికి వెళ్తే అబ్బాయిలు మంచు కురిసిపోతారు’ అనే ఇన్ డైరెక్ట్ బోల్డ్ డైలాగ్ యూత్ కోసం పెట్టేశారు. సినిమాలో వెన్నెల కిషోర్, శ్రీ విష్ణు కామెడీ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. రీసెంట్ గా బాగా ఫేమస్ అయిన బుల్లిరాజు అలియాస్ రేవంత్ ను ఇందులో తీసుకున్నారు. మూవీ ట్రైలర్ లో కథ చెప్పకపోయినా.. దాని బేస్ ఏంటి అనేది మాత్రం చూపించారు. మే 9న వస్తున్న ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
