Sri Sudha: నటి శ్రీసుధకి విమానంలో చేదు అనుభవం.. ఆకతాయి అక్కడ కాళ్లు వేసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Sudha Gives Strong Kick To A Man Who Misbehaved With Her In Flight: తమ జోలికి రావొద్దని కొందరు ఆకతాయిలు నోటితో చెప్తే వినరు.. చేత్తో చెప్తేనే దారిలోకి వస్తారు. ఇప్పుడు నటి శ్రీసుధ కూడా ఒక ఆకతాయిని కొట్టి, తగిన బుద్ధి చెప్పింది. మొదట్లో మాటలతో చెప్తే వినని అతగాడు, లాగి పెట్టి కొట్టగానే గాడిలోకి వచ్చాడు. అసలేం జరిగిందంటే.. ఇటీవల నటి శ్రీసుధ విమానంలో ప్రయాణించింది. అప్పుడు ఆమె వెనుక సీట్లో కూర్చున్న ఓ ఆకతాయి వెకిలి చేష్టలు చేశాడు. అతడు అదే పనిగా తన కాళ్లను ముందుకు చాచుతూ.. ముందు సీట్లో కూర్చున్న శ్రీసుధ కాళ్లను తాకే ప్రయత్నం చేశాడు.
Driving Fine: డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే.. రూ. 20,000 జరిమానా
Also Read
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
మొదటిసారి అతని కాళ్లు తగిలినప్పుడు.. శ్రీసుధ మర్యాదగా కాళ్లు తీయాలని సూచించింది. అయినా అతడు వినకుండా మరోసారి తన కాళ్లని ముందుకు చాచాడు. అప్పుడు కూడా ఆవేశం కోల్పోకుండా కాళ్లు తీయమని హెచ్చరించింది. విమానం సిబ్బందితో సైతం చెప్పించింది. అప్పటికీ అతడు మాట వినకుండా.. తన కాళ్లను ముందుకు చాచాడు. దీంతో కోపాద్రిక్తురాలైన శ్రీసుధ.. ఇక వీడికి తగిన బుద్ధి చెప్పాల్సిందేనని నిర్ణయించుకొని, గట్టిగా ఒకటి లాగిపెట్టి కొట్టింది. ఆ దెబ్బకు అతడి కళ్లు బైర్లు కమ్మాయి. అప్పుడు అతడు కాళ్లను వెనక్కు తీసుకొని, చక్కగా కూర్చున్నాడు. ఈ మొత్తం తతంగం గురించి శ్రీసుధ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. అలాగే.. అతడు ఏరకంగా తనని ఇబ్బంది పెట్టాడో కూడా ఫోటో షేర్ చేసింది.
Daggubati Purandeswari: బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతుంది.. ఉమ్మడి సీఎం అభ్యర్థిపై వారిదే నిర్ణయం
ఆ ఫోటోలో అతగాడు శ్రీసుధ సీటు కింద కాళ్లు పెట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. ‘‘దీనిపై ఎలా స్పందించాలి? సిబ్బందికి రెండుసార్లు చెప్పినా అతడి బుద్ధి మారలేదు. అందుకే ఒక్కటిచ్చాను. అతడి బొక్కలు విరిగితే నాకు ఎలాంటి సంబంధం లేదు’’ అంటూ శ్రీసుధ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. అతనికి సరైన గుణపాఠమే నేర్పావంటూ, నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. కాగా.. గతంలోనూ శ్రీసుధ ఓ పెద్ద వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు తమ్ముడు శ్యామ్ కే.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ.. ఆ మధ్య సంచలన ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారం అప్పట్లో ఇండస్ట్రీలో పెనుదుమారమే రేపింది.
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!