NTV Telugu Site icon

Sri Sudha: నటి శ్రీసుధకి విమానంలో చేదు అనుభవం.. ఆకతాయి అక్కడ కాళ్లు వేసి..

Sri Sudha Flight Issue

Sri Sudha Flight Issue

Sri Sudha Gives Strong Kick To A Man Who Misbehaved With Her In Flight: తమ జోలికి రావొద్దని కొందరు ఆకతాయిలు నోటితో చెప్తే వినరు.. చేత్తో చెప్తేనే దారిలోకి వస్తారు. ఇప్పుడు నటి శ్రీసుధ కూడా ఒక ఆకతాయిని కొట్టి, తగిన బుద్ధి చెప్పింది. మొదట్లో మాటలతో చెప్తే వినని అతగాడు, లాగి పెట్టి కొట్టగానే గాడిలోకి వచ్చాడు. అసలేం జరిగిందంటే.. ఇటీవల నటి శ్రీసుధ విమానంలో ప్రయాణించింది. అప్పుడు ఆమె వెనుక సీట్లో కూర్చున్న ఓ ఆకతాయి వెకిలి చేష్టలు చేశాడు. అతడు అదే పనిగా తన కాళ్లను ముందుకు చాచుతూ.. ముందు సీట్లో కూర్చున్న శ్రీసుధ కాళ్లను తాకే ప్రయత్నం చేశాడు.

Driving Fine: డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే.. రూ. 20,000 జరిమానా

మొదటిసారి అతని కాళ్లు తగిలినప్పుడు.. శ్రీసుధ మర్యాదగా కాళ్లు తీయాలని సూచించింది. అయినా అతడు వినకుండా మరోసారి తన కాళ్లని ముందుకు చాచాడు. అప్పుడు కూడా ఆవేశం కోల్పోకుండా కాళ్లు తీయమని హెచ్చరించింది. విమానం సిబ్బందితో సైతం చెప్పించింది. అప్పటికీ అతడు మాట వినకుండా.. తన కాళ్లను ముందుకు చాచాడు. దీంతో కోపాద్రిక్తురాలైన శ్రీసుధ.. ఇక వీడికి తగిన బుద్ధి చెప్పాల్సిందేనని నిర్ణయించుకొని, గట్టిగా ఒకటి లాగిపెట్టి కొట్టింది. ఆ దెబ్బకు అతడి కళ్లు బైర్లు కమ్మాయి. అప్పుడు అతడు కాళ్లను వెనక్కు తీసుకొని, చక్కగా కూర్చున్నాడు. ఈ మొత్తం తతంగం గురించి శ్రీసుధ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. అలాగే.. అతడు ఏరకంగా తనని ఇబ్బంది పెట్టాడో కూడా ఫోటో షేర్ చేసింది.

Daggubati Purandeswari: బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతుంది.. ఉమ్మడి సీఎం అభ్యర్థిపై వారిదే నిర్ణయం

ఆ ఫోటోలో అతగాడు శ్రీసుధ సీటు కింద కాళ్లు పెట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. ‘‘దీనిపై ఎలా స్పందించాలి? సిబ్బందికి రెండుసార్లు చెప్పినా అతడి బుద్ధి మారలేదు. అందుకే ఒక్కటిచ్చాను. అతడి బొక్కలు విరిగితే నాకు ఎలాంటి సంబంధం లేదు’’ అంటూ శ్రీసుధ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. అతనికి సరైన గుణపాఠమే నేర్పావంటూ, నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. కాగా.. గతంలోనూ శ్రీసుధ ఓ పెద్ద వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ చోటా కే నాయుడు త‌మ్ముడు శ్యామ్ కే.నాయుడు త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని మోసం చేశాడ‌ంటూ.. ఆ మధ్య సంచలన ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారం అప్పట్లో ఇండస్ట్రీలో పెనుదుమారమే రేపింది.