Site icon NTV Telugu

Ustaad: ఆకాశం నీ హద్దురా ‘ఉస్తాద్’…

Ustaad

Ustaad

దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో నుంచి, ఇండియన్ సినిమా ప్రైడ్ కీరవాణి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు ‘శ్రీ సింహా కోడూరి’. చైల్డ్ ఆర్టిస్ట్ గా యమదొంగ, మర్యాద రామన్న సినిమాల్లో నటించిన శ్రీ సింహా ‘మత్తు వదలరా’ సినిమాతో సోలో హీరోగా మారాడు. మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టిన సింహా కోడూరి, ఆ తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. శ్రీ సింహా కోడూరి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్’. సాయి కొర్రపాటి, క్రిషీ ఎంటర్తైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాని ఫనిదీప్ డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో సింహా కోడూరి పుట్టిన రోజు సంధర్భంగా ఫిబ్రవరి 23న ‘ఉస్తాద్’ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన మేకర్స్, లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ని విడుదల చేశారు. బలగం ఫేమ్ కావ్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ టీజర్ ఇంప్రెస్ చేసింది. ఎత్తుని చూడాలి అంటేనే భయపడే ఒక చిన్న కుర్రాడు, టీనేజర్ గా మారిన తర్వాత పైలట్ గా అయ్యే వరకూ ఏం జరిగింది అనేది ఉస్తాద్ కథగా కనిపిస్తోంది.

ఈ టీజర్ లో సింహా చాలా ప్రామిసింగ్ గా కనిపించాడు. లైట్ గా ఆకాశం నీ హద్దురా, గౌతమ్ SSC సినిమాల టింట్ ఉస్తాద్ టీజర్ లో కనిపిస్తోంది. ఈ టీజర్ లో ‘పవన్ కుమార్ పప్పుల’ సినిమాటోగ్రఫి ఆకట్టుకుంది. అకీవ బీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉస్తాద్ టీజర్ ని ఎలివేట్ చేసింది. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే RX 100 బైక్ ని ఉస్తాద్ సినిమాలో బాగా వాడినట్లు ఉన్నారు. టీజర్ లో ఈ బైక్ కి మంచి షాట్స్ పడ్డాయి. ఓవరాల్ గా టీజర్ అయితే పాజిటివ్ వైబ్ ని తీసుకోని వచ్చింది. మరి తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త సినిమాలతో ఆశించిన స్థాయిలో అట్రాక్ట్ చెయ్యలేకపోయిన శ్రీ సింహా కోడూరి ‘ఉస్తాద్’ సినిమాతో హిట్ కొడతాడేమో చూడాలి.

Exit mobile version