NTV Telugu Site icon

Sreemukhi: మొన్న అలా, ఇప్పుడు ఇలా.. చూపిస్తూ కవ్విస్తే తట్టుకోవడం ఎలా శ్రీముఖీ?

Sreemukhi Thumb

Sreemukhi Thumb

Sreemukhi Black Short Dress Photos raising heat on internet: యాంకర్ శ్రీముఖి ప్రస్తుతానికి టాలీవుడ్ లో హాట్ యాంకర్స్ లో ఒకరిగా దూసుకుపోతోంది. నిజానికి కెరీర్ మొదట్లో అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి సినిమాలో ఆయన సోదరి పాత్రలో కనిపించి మెప్పించింది. Sreemukhi2 ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు కానీ బుల్లి తెరలో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి పటాస్ షో తో స్టార్ యాంకర్ అయి పోయింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో ఒక పక్క సినిమాలు చేస్తూ మరొక పక్క షోలు కూడా చేస్తూ జూనియర్ రాములమ్మ అనిపించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి కొంచెం టైటిల్ మిస్ చేసుకున్నా అక్కడ వచ్చిన క్రేజ్ తో సోషల్ మీడియాలో దూసుకు పోయింది. అయితే ఈ మధ్యనే శ్రీముఖి భోళా శంకర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఖుషి సినిమాకి సంబంధించిన నడుము సీన్ రీ క్రియేట్ చేసి విమర్శల పాలయ్యింది. అయితే సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అందులో శ్రీముఖి మిస్టేక్ ఏమీ లేకపోయినా సినిమా టాక్ రావడానికి ఈ సీన్ కూడా ఒక కారణం అనేది చర్చలు వినిపిస్తున్నాయి. ఏదైతేనేం ఆ సంగతి పక్కన పెడితే తాజాగా అన్న సోషల్ మీడియాలో బ్లాక్ కలర్ షార్ట్ డ్రెస్ లో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు హాట్ గా ఉండడంతో అనే అభిమానులు అందరూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే ఇంత హాట్ నెస్ చూపిస్తే తట్టుకోవడం ఎలా అంటూ కామెంట్ చేస్తున్నారు.

Show comments