Sreeleela : శ్రీలీల పడి లేచిన కెరటంలా ఇప్పుడు అవకాశాలు పడుతోంది. పుష్ప-2 కంటే ముందు చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ పాత్ర పడలేదు. కేవలం గ్లామర్, డ్యాన్స్ ల వరకే పరిమితం అయిపోయింది. పైగా చేసిన సినిమాల్లో ఎక్కువగా ప్లాపులే ఉండటంతో అవకాశాలు తగ్గిపోయాయి. కానీ పుష్ప-2 ఐటెం సాంగ్ చేసి మంచి పాపులారిటీ సంపాదించింది. దెబ్బకు మళ్లీ ఛాన్సులు క్యూ కడుతున్నాయి. కానీ ఛాన్సులు వస్తున్నాయి కదా అని ఏది పడితే అది చేసేస్తోంది. మొన్న గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటి పక్కన నటించింది. అసలు పరిచయమే లేని కొత్త హీరో పక్కన ఆమె నటించింది. ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఒప్పించారు. కానీ ఈ సినిమాలో ఆమె పాత్ర కేవలం గ్లామర్, డ్యాన్సులకే పరిమితం అయింది.
Read Also : Ustad Bhagat Singh : అలా చేస్తే చట్టపరమైన చర్యలు.. వాళ్లకు ‘మైత్రీ’ వార్నింగ్..
దాంతో అసలు ఈ పాత్ర ఎందుకు చేసిందా అంటూ ఆమె ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. పైగా కిరీటితో హద్దులు దాటేసి రొమాన్స్ చేసింది. పెద్ద హీరోలతో కూడా రొమాన్స్ చేయని శ్రీలీల ఇలా కిరీటీతో చేయడంపై ఆమె ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. శ్రీలీలను మంచి కంటెంట్ ఉన్న పాత్రలో చూడాలని ఆమె ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. కానీ ఆమె మాత్రం స్టఫ్ లేని పాత్రలు ఎంచుకుంటూ వెళ్తోంది. హీరోయిన్ గా ఎక్కువ కాలం నిలబడాలంటే కచ్చితంగా సత్తా ఉన్న పాత్రలు చేయాల్సిందే. లేదంటే గ్లామర్ ఎక్కువ కాలం ఆమెను ముందుకు నడపదు. అందం, డ్యాన్స్ ఎలాగూ ఉన్నాయి. కాబట్టి నటన పరంగా తనను తాను నిరూపించుకుంటే ఇంకొంత కాలం టాలీవుడ్ లో అవకాశాలు వస్తాయంటున్నారు ఆమె ఫ్యాన్స్.
Read Also : Raashi Khanna : పవన్ పక్కన ఛాన్స్ కొట్టేసిన ప్లాపుల హీరోయిన్..
