దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లో రెండు హీరోయిన్లను తీసుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. ఇప్పుడు మహేశ్‌బాబుతో చేయనున్న సినిమాకూ అదే స్ట్రాటజీని అనుసరిస్తున్నాడు. ఆల్రెడీ ఒక కథానాయికగా పూజా హెగ్డే కన్ఫమ్ అయ్యింది. కానీ, రెండో హీరోయిన్ పాత్రకే ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు. మొదట్లో మీనాక్షి చౌదరి పేరు బాగా చక్కర్లు కొట్టింది.
‘ఖిలాడి’ సినిమాలో రవితేజ సరసన నటించిన ఈ బ్యూటీకి ఫిదా అయి, త్రివిక్రమ్ ఈమెను మహేశ్ బాబు సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా ఎంపిక చేశాడని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ, అధికార ప్రకటన మాత్రం రాలేదు. ఆ తర్వాత నభా నటేశ్, నిధీ అగర్వాల్ పేర్లు కూడా చక్కర్లు కొట్టాయి. వాళ్ల సంగతేమైందో తెలీదు కానీ.. రీసెంట్‌గా శ్రీలీల పేరు తెరమీదకొచ్చింది. ఈ అమ్మడు దాదాపు ఫైనల్ అయినట్లు తెగ వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఈ భామకి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది కాబట్టి, ఈమెను తీసుకోవాలని త్రివిక్రమ్ భావించాడట! ఆమెని సంప్రదించడం, మహేశ్ మరదలిగా నటించడానికి శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయిందని టాక్ వినిపించింది.
కానీ, లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ యంగ్ బ్యూటీ కూడా ఈ ఆఫర్‌ని రిజెక్ట్ చేసిందట! హీరోయిన్‌గానే తనకు బోలెడన్న ఆఫర్లు వచ్చిపడుతున్న తరుణంలో, సెకండ్ హీరోయిన్‌గా చేస్తే తన కెరీర్‌పై ప్రభావం చూపొచ్చని, అందుకే అమ్మడు ఈ అవకాశాన్ని తిరస్కరించిందని అంటున్నారు. మరి, ఈ సెకండ్ హీరోయిన్‌గా ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.
