NTV Telugu Site icon

Sreeleela: స్టార్ హీరోయిన్లే ఆ పనికి ఒప్పుకున్నారు.. అందుకే నేను కూడా ఒప్పుకున్నా

Sreeleela

Sreeleela

Sreeleela: ప్రస్తుతం టాలీవుడ్ కుర్రకారును గిలిగింతలు పెడుతున్న హీరోయిన్ శ్రీలీల. దర్శకేంద్రుడి చేతుల మీదగా పరిచయం అయిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ సినిమా తరువాత స్టార్ హీరోల సరసన అవకాశాలను అందుకొని ఔరా అనిపించింది. ప్రస్తుతం శ్రీలీల, రవితేజ సరసన ధమాకాలో నటించింది. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది. దీంతో శ్రీలీల వరుస ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ సినిమా కబుర్లు చెప్పుకొస్తుంది. ఇక రవితేజ గురించి ఈ అమ్మడు చెప్పిన వ్యాఖ్యలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని మాస్ మహారాజా ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.

రవితేజతో నటించడం చాలా సంతోషంగా ఉందని, ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం ఎవరి వలన కాదని చెప్పుకొచ్చింది. ఇక రవితేజ లాంటి సీనియర్ హీరోలతో నటించడం, ఏజ్ గ్యాప్ గురించి అడిగిన ప్రశ్నకు శ్రీలీల గట్టిగానే సమాధానం చెప్పింది. “నాకన్నా ముందు స్టార్ స్టార్ హీరోయిన్లే.. తమకంటే ఎక్కువ వయస్సు ఉన్న హీరోలతో కలిసి నటించారు. వారే ఏజ్ గురించి పట్టించుకోలేదు. ఇక నేనేంత చెప్పండి”అంటూ నవ్వేసింది. అమ్మడు నార్మల్ గా చెప్పినా గట్టి కౌంటర్ అయితే ఇచ్చిందని తెలుస్తోంది. మరి ఈ కుర్ర హీరోయిన్, సీనియర్ హీరోతో ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.