Site icon NTV Telugu

Sreeleela : అదే హీరోతో మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన శ్రీలీల..?

Sreeleela

Sreeleela

యంగ్ బ్యూటీ శ్రీలీల వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా, ఆమెకు ఆశించిన స్థాయి బ్లాక్‌బస్టర్ మాత్రం ఇంకా అందలేదు. అయితే కెరీర్ గ్రాఫ్‌ను సెట్ చేసుకునే ప్రయత్నంలో, ప్రతి ప్రాజెక్ట్‌ను చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తోంది. ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘పరాశక్తి’ చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధం కావడంతో, టాలీవుడ్–కోలీవుడ్ ఆడియన్స్‌ రెండింటి దృష్టి కూడా ఈ సినిమాపై ఉంది.

Also Read : Globetrotter event : పాస్‌లు కాదు.. పాస్‌పోర్ట్‌లు.. రాజమౌళి ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈవెంట్‌కి క్రియేటివ్ ఎంట్రీ పాస్ వైరల్

ఇదిలా ఉండగా, సినిమా విడుదలకు ముందే శ్రీలీల మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిందన్న వార్తలు ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే… మళ్లీ శివకార్తికేయన్‌తోనే ఆమె హీరోయిన్‌గా కనిపించబోతుందన్న రూమర్స్ వేగంగా వైరల్ అవుతున్నాయి. ఒక సినిమా రిలీజ్ కాకముందే అదే జంట మరోసారి స్క్రీన్‌పై కనబడబోతున్నారన్న ఊహాగానాలు అభిమానుల్లో ప్రత్యేక హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ కొత్త ప్రాజెక్ట్‌కు సిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం.

గతంలో ఆయన–శివకార్తికేయన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘డాన్’ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఈ కాంబోలో వచ్చే తదుపరి చిత్రం పై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఎవరు ఫైనల్ అవుతారు అన్న దానిపై కూడా పెద్ద ఆసక్తి నెలకొంది. సోర్సెస్ ప్రకారం, ఈ సినిమా డిసెంబర్ 10న షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఏది ఏమైనా… శివకార్తికేయన్–శ్రీలీల జంట స్క్రీన్‌పై ఫ్రెష్‌నెస్ ఇవ్వగలదన్న నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా కనిపిస్తోంది.

Exit mobile version