NTV Telugu Site icon

Boyapati Rapo: రామ్, శ్రీలీల.. మామూలుగా లేరుగా!

Boyapati Rapo

Boyapati Rapo

ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ బ్యూటీ శ్రీలీల హవా నడుస్తోంది. సెట్స్ పై ఉన్నబడా సినిమాల్లో.. శ్రీలీల లేని సినిమా లేదనే చెప్పాలి. అమ్మడి అందం, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, ముఖ్యంగా డ్యాన్స్ విషయంలో కుర్రకారుకు బాగా కనెక్ట్ అయిపోయింది శ్రీలీల. అలాంటి ఈ బ్యూటీకి తోడుగా ఎనర్జిటిక్ హీరో రామ్ తోడైతే.. విజిల్స్‌తో థియేటర్ టాపులు లేచిపోవాల్సిందే. రామ్, బోయపాటి అప్ కమింగ్ మూవీతో ఇదే జరగబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో బోయపాటి మార్క్‌ మాస్ ఎలిమెంట్స్‌తో.. ఊరమాస్‌గా ఈ సినిమా రాబోతోందని చెప్పేశారు. వచ్చే దసరాకు రామ్, బోయపాటి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా టైటిల్ అనౌన్స్మెంట్ చేయలేదు. ప్రస్తుతానికి #BoyapatiRAPO అంటూ వర్కింగ్ టైటిల్‌తోనే షూటింగ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్‌లో జరుగుతోంది. జూన్ 15 వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. అక్కడే ఓ సాంగ్ కూడా షూట్ చేయనున్నారు. ఈ క్రమంలో రామ్, శ్రీలీల ఫోటోలు బయటికొచ్చాయి. మామూలుగానే ఈ ఇద్దరి స్పీడ్‌ను తట్టుకోవడం కష్టం. అలాంటి ఈ ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి.. జస్ట్ శాంపిల్‌గా ఈ ఫోటోలు ఉన్నాయి. డబుల్ ఎనర్జీ లోడింగ్ అన్నట్టుగా ఉంది. రామ్ స్టైలిష్‌గా కనిపిస్తుండగా.. శ్రీలీల చాలా క్యూట్‌గా అందంగా కనిపిస్తోంది. ఆన్ స్క్రీన్ పై ఈ జోడి అదరగొట్టడం ఖాయమనేలా ఉన్నారు. ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి రామ్, శ్రీలీల ఫోటో ఒక్కటి బయటికి రాలేదు. దాంతో లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి రామ్, శ్రీలీల ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.