Site icon NTV Telugu

Sreeleela: ఆ అమ్మే .. ఈ అమ్మగా వచ్చిందంటనే

Sree

Sree

Sreeleela: సాధారణంగా చిత్ర పరిశ్రమలో పోలికలు ఎక్కువ ఉంటాయి. ఒక నటుడు చనిపోతే .. ఆ ప్లేస్ ను వేరొకరితో రీప్లేస్ చేయడం చూస్తూనే ఉంటాం. ఎక్కువగా హీరోయిన్స్ విషయంలో ఈ పోలిక ఉంటుంది. ఉదాహరణకు సావిత్రి చనిపోయాకా .. ఆమెను రీప్లేస్ చేయడం ఎవరి వలన కాలేదు.. కానీ, నడవడిక, నటన ను బట్టి కీర్తి సురేష్, నిత్యా మీనన్ తో పోలుస్తూ వచ్చారు. ఆ తరువాత సౌందర్య.. సాయిపల్లవి నెక్స్ట్ సౌందర్య అంటూ చెప్పుకొచ్చారు. ఇక తాజాగా కుర్ర హీరోయిన్ శ్రీలీలను చనిపోయిన ఆర్తి ఆగర్వాల్ తో పోల్చడం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పెళ్లిసందD సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టి బిజీయెస్ట్ హీరోయిన్ గా మారింది. హిట్లు, ప్లాపులు పక్కన పెడితే.. సీనియర్, జూనియర్ హీరోలతో ఖాళీ లేకుండా సినిమాలు చేసిన హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబు సరసన గుంటూరు కారం చిత్రంలో నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి నిన్న సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయ్యింది.

ఓ మై బేబీ అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోలో గ్రీన్ కలర్ లంగావోణిలో శ్రీలీల అచ్చతెలుగు ఆడపడుచులా మారిపోయి.. వయ్యారాలు ఒలకబోసింది. ఇక ఈ ప్రోమో చూసినదగ్గరనుంచి.. ఈ చిన్నది.. ఆర్తీ అగర్వాల్ లా కనిపిస్తుందని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అంతేనా ఆమె ఫోటోను.. ఈమె ఫోటోను పక్కనపెట్టి మీమ్స్ కూడా చేస్తున్నారు.. ఆ అమ్మే .. ఈ అమ్మగా వచ్చిందంట అంటూ కంపేర్ చేస్తున్నారు. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో ఆర్తీ అగర్వాల్ ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని.. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకొని.. అది వికటించడంతో ఆమె మృతిచెందింది. ఇక ఇప్పుడు ఆమె రూపంలానే శ్రీలీల కనిపిస్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ పోలికపై శ్రీలీల ఏం అంటుందో చూడాలి.

Exit mobile version