ప్రస్తుతం తెలుగులో శ్రీలీల టైం నడుస్తోంది. ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అవగానే… ఒకేసారి ఏకంగా పదికి పైగా ఆఫర్లు అందుకుంది. వచ్చిన ప్రతి ఆఫర్‌ని తన ఖాతాలో వేసుకుంటూ… రష్మిక, పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్లకు సైతం ఆఫర్లు లేకుండా చేస్తోంది అమ్మడు. అంతేకాదు… నెలకో సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. రీసెంట్‌గా స్కంద సినిమాతో పలకరించిన శ్రీలీల.. దసరా కానుకగా అక్టోబర్ 19న ‘భగవంత్ కేసరి’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత నవంబర్‌లో వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’, డిసెంబర్‌లో నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్టిడినరీ మేన్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక 2024లో సాలిడ్ ఎంట్రీ ఇవ్వనుంది అమ్మడు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
ఈ సినిమాలతో శ్రీలీల టాలీవుడ్ టాప్ లీగ్‌లోకి వెళ్లిపోవడం ఖాయం. ఆ తర్వాత సమ్మర్‌లో పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి… నెక్స్ట్ ఇయర్ కూడా శ్రీలీలదే హవా కానుంది. ఇలా నెలకో సినిమాతో రచ్చ చేయనున్న శ్రీలీల… రీల్ పై కనిపిస్తున్నంత ఈజీగా రియల్ లైఫ్‌లో లేదట. భగవంత్ కేసరి ప్రమోషన్లలో భాగంగా… నెలకో సినిమా రిలీజ్ అవుతుంది కదా.. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అనే ప్రశ్నకు నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఎంజాయ్ చేస్తున్నానా? మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో మీకేం తెలుసు. ఒక పక్క షూటింగ్ ఇంకో పక్క డబ్బింగ్… మరో షూట్ చేయాలి. నా పరిస్థితి మామూలుగా లేదు. అయినా సీనియర్ ఎన్టీఆర్ లాంటి వారితో పోలిస్తే మనం చేసేది నథింగ్ అనిపించింది. ఒకేసారి అన్ని సినిమాలు సెట్స్ పైకి వచ్చాయి. అందుకే లైన్‌గా రిలీజ్ అవుతున్నాయి.. అంతే..’ అని చెప్పుకొచ్చింది. ఏదేమైనా.. శ్రీలీల మాత్రం టాలీవుడ్ లో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది.